ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ముఖ్య గమనిక. ఇంజినీరింగ్‌తోపాటు వ్యవసాయం, ఫార్మసీ రంగాల్లో ప్రవేశ పరీక్షలకు ప్రాథమిక 'కీ'లను అందుబాటులోకి తెచ్చారు. అభర్ధులకు ప్రాథమిక 'కీ'లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వారు 26వ తేదీ ఉదయం 9లోపు తెలపాలని తెలియజేసారు. ఈ విషయాన్ని స్వయంగా ఈఏపీసెట్ ఛైర్మన్ రంగజనార్దన్ తెలిపారు.
ఈఏపీసెట్ పరీక్షలు ఈ నెల 15న ప్రారంభమయ్యాయి, మొత్తం 93.38 శాతం మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,24,724 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, ఫార్మసీ, వ్యవసాయ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు హాజరయ్యారు. మీరు ఇంజనీరింగ్, వ్యవసాయం లేదా ఫార్మసీ కోర్సులకు ప్రాథమిక 'కీల' కోసం చూస్తున్నట్లయితే, https://cetsapsche.ap.gov.inకి వెళ్లండి. మీరు మరింత సమాచారం ఈ వెబ్సైట్ లో పొందవచ్చు.
ఇది కూడా చదవండి..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం.. కిలో ఎంతో తెలుసా?
'కీ' ఈవిధంగా డౌన్లోడ్ చేసుకోండి..
➨విద్యార్థులు ముందుగా https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ ను సందర్శించండి.
➨ఈ వెబ్సైట్ కి వెళ్లిన తరువాత Master Question Paper With Preliminary Keys అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
➨క్లిక్ చేయగానే Engineering మరియు Agriculture & Pharmacy ప్రాథమిక కీ ఆప్షన్లు కనిపిస్తాయి.
➨సెషన్ల వారిగా పరీక్ష రాసిన విద్యార్థులు తమ తేదీలపై క్లిక్ చేయాలి.
➨అలా చేసిన తరువాత 'కీ' ఓపెన్ అవుతుంది.
➨డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి పీడీఎఫ్ ను పొందవచ్చు.
ఇది కూడా చదవండి..
Share your comments