ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ అడ్మిషన్ల షెడ్యూల్ వాయిదా పడింది. ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ కు ఆన్ లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం జూలై 24 నుంచి ఆగస్ట్ 3వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇది ఇలా ఉండగా ఆగస్ట్ 3వ తేదీ నుండి విద్యార్థులకు కళాశాలల ఎంపిక కొరకు వెబ్ అప్షన్ల ప్రక్రియ ప్రారంభం కావలసి ఉంది.
కాగా ఇటీవలి ప్రభుత్వం కళాశాలల ఎంపిక కొరకు ఈ వెబ్ అప్షన్ల ప్రక్రియను ఆగస్టు 7నుండి ప్రారంభించేలా వాయిదా వేసింది. అదనంగా మరొకవైపు విద్యార్థులకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశాన్ని 6వ తేదీ ఆగష్టు వరకు పెంచారు. ఈ వాయిదా ఫలితంగా, సీట్ల కేటాయింపు మరియు కళాశాల బదిలీల తేదీలు కూడా మారుతాయి.
ఫలితంగా తొలుత ఆగస్టు 16న ప్రారంభించాలనుకున్న ఇంజినీరింగ్ తరగతులను కూడా వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీలకు ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది, ఈ ప్రక్రియ ప్రతి మూడేళ్లకు జరుగుతుంది.
ఇది కూడా చదవండి..
కోకాపేటలో కోట్లు పలికిన భూములు.. ఎకరం రూ.100 కోట్లు.. ఎందుకు అంత ధర?
అయితే కొన్ని కళాశాల యాజమాన్యాలు ఫీజు పెంపుదలకు సంబంధించి తమ ఆందోళనలను పరిష్కరించేందుకు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో ఈ అంశాన్ని సమగ్రంగా విచారించే బాధ్యతను కోర్టు స్వీకరించింది. ఈ దర్యాప్తు ప్రక్రియలో ముఖ్యమైన దశగా, కనీస ఫీజు 45 వేలు గా నిర్దారిస్తామని విచారణలో భాగంగా కోర్టు తెలిపింది.
కేసు విచారణ పూర్తయిన తర్వాత ఫీజులకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అమలు చేయాల్సిన కొత్త ఫీజులను కోర్టు నిర్ణయిస్తుంది. ఒకసారి ఫీజులు నిర్ణయించబడిన తర్వాత మాత్రమే, విద్యార్థులు తమకు అనుగుణంగా ఉండే కలాశాలలను ఎంచుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని అధికారులు నిర్ణయించారు.
ఇది కూడా చదవండి..
Share your comments