Education

టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు గమనిక.! పరీక్ష వాయిదా.. ఎప్పుడంటే?

Gokavarapu siva
Gokavarapu siva

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అభ్యర్థులందరి దృష్టికి, ఇంటర్ మరియు టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో ఫిజికల్ డైరెక్టర్ ఎంపిక మరియు నియామకం కోసం షెడ్యూల్ చేయబడిన పరీక్ష వాయిదా పడింది. కొత్త షెడ్యూల్ ప్రకారం, గురువారం రెండు వేర్వేరు పరీక్షలు నిర్వహించబడతాయి. మొదటి పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, రెండో పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.

టీఎస్‌పీఎస్సీ ఈ విషయాన్ని మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష ఈ నెల 11వ తేదీన(సోమవారం) జరగాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పరీక్షను 14వ తేదికి వాయిదా వేస్తున్నట్లు TSPSC తెలిపింది. అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను పొందేందుకు TSPSC అధికారిక వెబ్‌సైట్ (https://www.tspsc.gov.in/)ని సందర్శించాలని సూచించారు. ఈ హాల్ టిక్కెట్లు పరీక్షకు ఒక వారం ముందు అందుబాటులో ఉంచనున్నారు.

మరొకవైపు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ల నియామక ప్రక్రియను సజావుగా మరియు సమర్ధవంతంగా నిర్వహించేందుకు TSPSC కృషి చేస్తుంది.ఆన్‌లైన్‌ పరీక్షల హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in/ లో అందుబాటులో ఉంచింది.

ఇది కూడా చదవండి..

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు .. యెల్లో , ఆరంజ్ అలెర్ట్ జారీ !

సెప్టెంబర్ 12 నుంచి అక్టోబరు 3 వరకు జరగనున్న కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) పరీక్షలకు వారం రోజుల ముందే హాల్ టికెట్లను అందుబాటులో ఉంచడం గమనార్హం. దాదాపు 1392 పోస్టులకు గానూ ఈ నియామక ప్రక్రియ జరుగుతోంది. 11 రోజులపాటు ఆయా తేదీల్లో 16 సబ్జెక్టుల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. ఒక అభ్యర్థి రెండు మూడు సబ్జెక్టులకు దరఖాస్తు చేసినా.. సబ్జెక్టు వారీగా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలిని సూచించింది TSPSC. అభ్యర్థులు మోడల్‌ పరీక్షలు రాయొచ్చని.. ఆ లింక్‌ను వెబ్‌సైట్లో ఉంచినట్లు వెల్లడించింది.

ఇది ఇలా ఉండగా, ఫీజుల నియంత్రణ మరియు నిర్వహణకు చురుకైన చర్యలు తీసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అమలు కొరకు, తెలంగాణ ప్రభుత్వం వసూలు చేస్తున్న రుసుములను నియంత్రించడానికి మరియు పర్యవేక్షించడానికి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. హై కోర్టు ఆదేశాలతో మెమో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

ఇది కూడా చదవండి..

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు .. యెల్లో , ఆరంజ్ అలెర్ట్ జారీ !

Related Topics

tspsc exam postponment

Share your comments

Subscribe Magazine

More on Education

More