తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఖమ్మం జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఈ శుభవార్తని అందించింది. రాష్ట్రంలోని కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఇటీవలి తెలిపింది. దీనికి సంబంధించి ప్రస్తుతం నోటిఫికేషన్ కూడా ఆ శాఖ విడుదల చేసింది.
రాష్ట్రంలో మొత్తం 9 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ పోస్ట్లు అనేవి శిశు గృహ మేనేజర్, కౌన్సెలర్, సోషల్ వర్కర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఏఎన్ఎం విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. ఈ ఉద్యోగాలను ప్రభుత్వం కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపింది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అనుకుంటున్న వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి జులై 14 అనేది ఆఖరి తేదీ. ఈ తేదీకి ముందుగా అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించాలి.
వివిధ పోస్టులకు వివిధ విద్యార్హతలను నిర్ణయించారు. టెన్త్, ఇంటర్, బీఎస్సీ నర్సింగ్, గ్రాడ్యుయేషన్, పీజీ, ఎంఎస్సీ, పీజీ డిప్లొమా విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి 21-35 ఏళ్లుగా నిర్ణయించారు. అయితే.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయో పరిమితిలో ఐదేళ్ల పాటు సడలింపు ఇచ్చారు. అభ్యర్థులు ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
ఇది కూడా చదవండి..
కాంగ్రెస్ విధానం రైతులను అవమానించేలా ఉంది-మంత్రి KTR
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు వారి పోస్ట్ ఆధారంగా నెలకు రూ.7944-రూ.23170 వరకు జీతం అనేది ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో అందించాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు పాత డీఆర్డీఏ కార్యాలయం, బాల రక్షా భవన్ కార్యాలయం, బుర్హాన్ పురం, ఖమ్మం చిరునామాకి తమ
దరఖాస్తు: అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను బాల రక్షా భవన్ కార్యాలయం, పాత డీఆర్డీఏ కార్యాలయం, బుర్హాన్ పురం, ఖమ్మం చిరునామాలో సమర్పించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి..
Share your comments