Education

తెలంగాణాలో 1553 లైన్‌మెన్‌, 48 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..

Srikanth B
Srikanth B

ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు (TSSPDCL ) దక్షిణ తెలంగాణ విద్యుత్​ పంపిణీ సంస్థ శుభవార్త అందించింది . (TSSPDCL ) దక్షిణ తెలంగాణ విద్యుత్​ పంపిణీ సంస్థలో )1553 జూనియర్‌ లైన్‌మెన్‌, 48 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది అర్హత కల్గిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవసి ఉంటుంది . మొత్తం 1601 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్య అర్హతలు :

జూనియర్ లైన్‌మ్యాన్ పోస్టులకు పదో తరగతితో పాటు ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్/ వైర్‌మ్యాన్‌) లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు (ఎలక్ట్రికల్ ట్రేడ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు ఇంజినీరింగ్‌ డిగ్రీ(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

10 వ తరగతి అర్హతతో పోస్టల్​శాఖలో 40,889 ఉద్యోగాలకు నోటిఫికేషన్​ విడుదల ..

వయసు: జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. లైన్‌మెన్‌కు రూ.24340- రూ.39405. అసిస్టెంట్ ఇంజినీర్‌కు రూ.64295- రూ.99345 జీతం చెల్లిస్తారు.

సెలెక్షన్​: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూనియర్ లైన్‌మెన్‌ ఖాళీలకు రాత పరీక్షతో పాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.tssouthernpower.com వెబ్​సైట్​ సంప్రదించాలి.

TSSPDCL గురించి :
తెలంగాణ యొక్క సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, TSSPDCL అని పిలుస్తారు , ఇది తెలంగాణాలోని 15 దక్షిణ జిల్లాలకు విద్యుత్ ను సరఫరా చేసే తెలంగాణ ప్రభుత్వానికి చెందిన రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ.

10 వ తరగతి అర్హతతో పోస్టల్​శాఖలో 40,889 ఉద్యోగాలకు నోటిఫికేషన్​ విడుదల ..

Related Topics

TSPDCL jobnotification

Share your comments

Subscribe Magazine

More on Education

More