లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్ట్ కోసం అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తు లను స్వీకరిస్తుంది.మొత్తం 300 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.licindia.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు .
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ:
అభ్యర్థులు జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం సంబంధిత వివరాలు :
53,600 నుండి 1,02,090 రూ.
విద్య అర్హతలు
అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం / సంస్థ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి.
వయో పరిమితి
LIC AAO రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC 5, OBC 3, విభిన్న ప్రతిభావంతులకు ఒక్కొక్కరికి 10 సంవత్సరాల సడలింపు. LIC ఉద్యోగులకు కూడా మినహాయింపు ఉంది. అర్హత మరియు వయస్సు జనవరి 1, 2023 నాటికి లెక్కించబడుతుంది.
ప్రారంభమైన గ్రూప్3 ఆన్‌లైన్ దరఖాస్తులు ...
ఎంపిక :
రెండు దశల్లో ఆన్‌లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు ,కర్నూల్ ,విశాఖపట్నం ,విజయవాడ , తెలంగాలో హైదరాబాద్ లో కేంద్రాలు ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మరియు ఇంగ్లిష్‌పై ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. మార్చి 18న ప్రధాన పరీక్ష.
దరఖాస్తు రుసుము
దరఖాస్తు రుసుము రూ.700. షెడ్యూల్డ్ కులాలు మరియు వికలాంగులకు ఇంటిమేషన్ ఛార్జీ రూ.85 సరిపోతుంది.
Share your comments