ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో మరింత నాణ్యమైన సేవలను అందించడానికి ఈ ఆర్బీకేలను రాష్ట్రంలో ప్రవేశపెట్టింది. వ్యవసాయ విస్తరణను రైతులకు మరింత చేరువ చేసే ప్రయత్నంగా ఈ ఆర్బీకేల ద్వారా రైతులకు ఇన్పుట్ లను డెలివరీ చేయడం, వ్యవసాయానికి సంబందించిన సాంకేతిక సలహాలను ఇవ్వడం వంటి పనులు చేస్తుంది. ప్రస్తుతం ఈ ఆర్బీకేల్లో పోస్టులు కాళిగా ఉన్నాయి.
ప్రభుత్వం ఈ ఆర్బీకేల పరిధిలో ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఈ ఆర్బీకేల్లో 7,384 పోస్టులు కాళిగా ఉన్నాయి. మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేలు రైతులకు సేవలు అందిస్తున్నాయి. ఈ ఆర్బీకేల్లో ఉన్న పోస్టులను శాఖల వారీగా వేరు చేసి భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఖాళీగా ఉన్న వాటిలో అధికంగా 5188 పోస్టులు అనేవి పశుసంవర్థక శాఖలో ఉన్నాయి. వీటి తరువాత ఉద్యాన శాఖలో 1644, వ్యవసాయ శాఖలో 467, మత్స్య శాఖలో 63 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తే కనుక, ఆర్బీకేల్లో పనిచేసే వారి సంఖ్యా మొత్తానికి 21,731కు చేరుతుంది. త్వరలోనే ఈ ఖాళీలను భర్తీ చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఇది కూడా చదవండి..
రైతులకు శుభవార్త.. ధరణిలో FAQ ఆప్షన్ .. రైతుల అన్ని సమస్యలకు సమాధానం !
ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలైన ఈ-క్రాప్, ఈ-కేవైసీ, పొలం బడులు, తోట, మత్స్య సాగు బడులు నిర్వాహణాలకు ఈ ఆర్బీకేల్లో పని చేసే సిబ్భంది పర్యటనలకు వెళ్తున్నారు. ఈ సమయంలో ఆర్బీకే సిబ్బంది కొరత రావడంతో అక్కడికి వచ్చే రైతులకు ఇబ్బందులు కలగకుండా వివిధ రకాల శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి వారికి సేవలు అందించాలనుకుంటున్నారు.
రైతులకు అందించే సేవల్లన్ని ఈ ఆర్బీకేల ద్వారా చేయడంతో వారికీ ఒత్తిడి పెరుగుతుంది. దీనితో రైతులకు అందించే సేవల్లో ఈ ఆర్బీకేలు వన్ స్టాప్ సొల్యూషన్ సెంటర్స్ గా మారాయి. ఈ నేపథ్యంలో శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఆర్బీకేల్లో ఎక్కువగా వ్యవసాయ మరియు పశుసంవర్ధక శాఖల్లోనే పని చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments