తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. దశల వారిగా జాబ్ నోటిఫికేషన్లు వస్తున్నాయి. మొత్తం 90 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత శాఖల వారిగా నోటిఫికేషన్లు వస్తున్నాయి.
ఇప్పటికే పోలీస్ శాఖతోపాటు ఇతర విభాగాల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయి. తాజాగా టీఎస్ ఎన్‌పీడీసీఎల్(TS NPDCL) నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది .
మొత్తం 82 అసిస్టెంట్ ఇంజనీర్లు(ఎలక్ట్రికల్) పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈనెల 27 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూలై 11 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఆగస్టు 14న రాత పరీక్ష ఉంటుంది. ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. పోస్టుల భర్తీలో ఎలాంటి అవకతవకలకు తావు ఉండదని అధికారులు తెలిపారు. అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని అధికారులు వెల్లడించారు .
వరుసగా నోటిఫికేషన్లు రావడంపై అభ్యర్థులు, నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా అభ్యర్థులు పోటీ పరీక్షలకు సన్నధం అవుతున్నారు . మరియు త్వరలోనే మరిన్ని నోటిఫికేషన్ లను విడుదల చేసేందుకు TSPSC సిద్ధం అవుతుంది. దీన్ని దృష్టిలో లో పెట్టుకొని అభ్యర్థులు సరైన తరహాలో ప్రేపరషన్ కొనసాగిస్తే ఈ సరి జాబ్ మీదే.
Share your comments