నిరుద్యోగులకు పోస్టల్ శాఖ శుభవార్త తెలిపింది. కేవలం 10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖ ఉద్యోగాల నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ పోస్టల్ శాఖలో ఉద్యోగాలు పొందడానికి నిరుద్యోగులు లక్షల్లో ఎదురుచూస్తూ ఉంటారు. దీనికి అనుగుణంగా పోస్టల్ శాఖ కూడా వివిధ సర్కిల్స్ లో నిరుద్యోగుల కొరకు నోటిఫికేషన్స్ భర్తీకి ఇస్తూ ఉంటుంది.
తాజాగా పోస్టల్ శాఖ ఉద్యోగాల భర్తీ కొరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు అనేవి స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించినవి అని అధికారులు తెలియజేసారు. అయితే ఈ ప్రకటనలో ఈ ఉద్యోగాలు అన్ని తమిళనాడు సర్కిల్ లో ఇవ్వనున్నట్లు తెలిపారు. అధికారులు మొత్తానికి పోస్టల్ శాఖలో 58 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు.
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు కావాలంటే వారు టెన్త్ క్లాస్ అనేది ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు ద్వారా పాస్ అవ్వి ఉండాలి. దీనితోపాటు అభ్యర్థులకు వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, ఈ లైసెన్స్ అనేది లైట్ లేదా హెవీ మోటార్ వెహికిల్స్ కు సంబంధించినది కావొచ్చు. మూడేళ్లపాటు వారికీ ఈ మోటార్ వెహికల్స్ నడిపిన అనుభవం ఉండాలి. మరియు వారికి మోటార్ మెకానిసమ్ పై అవగాహన కలిగి ఉండాలి అని నోటిఫికేషన్లో తెలిపారు.
ఇది కూడా చదవండి..
ఉద్యోగులకి శుభవార్త..ఒక్కొక్కరికి రూ.10 వేలు!
ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ అనేది ఈ నెల 31 వరకు ఉంది. కాబట్టి అర్హులు వెంటనే చివరి తేదీ ముగిసేలోగా దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు చేసుకోవడం ఎలా?
అభర్ధులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ విధానం లేదు కేవలం ఆఫ్లైన్ విధానంలో మాత్రమే వారి దరఖాస్తులను అభ్యర్థులు సమర్పించాలి. దీని కొరకు పోస్టల్ శాఖ అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తుకు సంబందించిన పీడీఎఫ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ దరఖాస్తు పత్రాలను పూర్తిగా నింపిన తరువాత, ఆ దరఖాస్తును Senior Manager (JAG), Mail Motor Service, No.37, Greams Road, Chennai 600006 చిరునామాకు పంపాలి.
ఇది కూడా చదవండి..
Share your comments