ఈ మధ్య కాలంలో అనేక రంగాల్లో డ్రోన్ల వినియోగం అధికం అవుతుంది. ముఖ్యంగా వ్యవసాయంలో మరియు రక్షణ విభాగంలో డ్రోన్ల యొక్క వినియోగం ఎక్కువగా కనపడుతుంది . వ్యవసాయంలో పంట పర్యవేక్షణలో, ప్రిసిషన్ అగ్రికల్చర్ లాంటి సాంకేతికతలో, మందుల పిచికారీలోను డ్రోన్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. డ్రోన్లకు పెరుగుతున్న క్రేజ్ తో పాటు వాటిని నడిపే డ్రోన్ పైలెట్లకు కూడా డిమాండ్ పెరుగుతుంది. అయితే అందరికి డ్రోన్స్ ని నడిపే అనుమతి లేదు. డ్రోన్లను ఎగురవెయ్యడానికి కావాల్సిన శిక్షణ తీసుకున్న వారికే ఆ అవకాశం ఉంటుంది. డ్రోన్ పైలట్ కావడానికి కావాల్సిన అర్హతలు ఏంటో ఈ ఆర్టికలో వివరంగా తెల్సుకుందాం.
డ్రోన్ల గురించి క్లుప్తంగా:
పెరుగుతున్న సాంకేతికత , మరియు అధికమవుతున్న డ్రోన్ ఉత్పత్తి కర్మాగారాల వళ్ళ, తక్కువ ధరకే డ్రోన్లు లభ్యమవుతున్నాయి. అనేక రంగాల్లో డ్రోన్ల వినియోగం విరివిగా జరుగుతుంది. ఇండియా లోని కొన్ని ఫుడ్ డెలివర్ సంస్థలు కూడా, కస్టమర్స్ కి ఫుడ్ డెలివరీ లో డ్రోన్లను ఉపయోగించే యత్నం లో ఉన్నాయ్. దీనివల్ల ఆ కంపెనీలకు అదనపు భారం తగ్గడమే కాక, ఫుడ్ డెలివరీ కి ఉపయోగించే మోటార్ బైకుల వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. ఇంకా వ్యవసాయంలో పురుగుమందుల పిచికారీలోను డ్రోన్ల వినియోగం ఎక్కువగానే చూస్తున్నాం. డ్రోన్లను ఉపయోగించి మందులు పిచికారీ చేయడం ద్వారా, పొలంలో అవసరమైన చోట మాత్రమే మందులు పిచికారీ చేస్తూ డబ్బు, మరియు సమయాన్ని రెండిటిని కాపాడుకోవచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్న డ్రోన్లలో చాల రకాలు ఉన్నాయ్, మల్టీ-రోటర్ డ్రోన్, ఫిక్స్డ్_వింగ్ డ్రోన్స్, ఫిక్స్డ్-వింగ్ హైబ్రిడ్ VTOL డ్రోన్స్. ఈ డ్రోన్స్ నడపడానికి డ్రోన్ పైలెట్ల అవసరం ఎంతో ఉంది.
డ్రోన్ పైలట్ కావడానికి కావాల్సిన అర్హతలు:
మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న డ్రోన్ పైలట్ శిక్షణ కోసం, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DCGA), కొన్ని రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజషన్స్(RPTO) కి డ్రోన్ పైలెట్స్ కు శిక్షణ ఇవ్వడానికి అనుమతిని ఇచ్చింది. ఇండియా లో మొత్తం 52 ట్రైనింగ్ సంస్థలు ఉన్నాయ్. ఈ సంస్థల్లో ట్రైనింగ్ పొందేందుకు, అభ్యర్థులు, కనీసం 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. దీనితో పాటుగా ఆధారకార్డ్, మరియు పాస్పోర్ట్ అవసరం.
ట్రైనింగ్ మొత్తం రెండు భాగాల్లో ఉంటుంది. మొదటిగా డ్రోన్ కు సంబంధించిన ప్రాధమిక సూత్రాలను, రేడియో టెలిఫోనీ, ఏరోడైనమిక్స్ , డ్రోన్ డేటా ఎనాలిసిస్ వంటి కీలక విషయాలపై అవగాహన కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ప్రాధమిక స్థాయి శిక్షణ అనంతరం, నిరవహించే పరీక్షను పాస్ కావడంతో రెండో భాగం శిక్షణ మొదలు అవుతుంది. ఈ భాగంలో అభ్యర్థి ఎంచుకున్న డ్రోన్ టైప్ని బట్టి శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం భోదకుని పర్యవేక్షణలో డ్రోన్ ఎగురవేసి చూపించవల్సి ఉంటుంది. అన్ని పరీక్షలని పూర్తి చేసిన తర్వాత అభర్ధులకు డ్రోన్ పైలట్ లైసెన్స్ లభిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, 2026 నాటికి డ్రోన్ మార్కెట్ 15,000 వేల కోట్లకు చేరుకుంటుంది అని అంచనా, తద్వారా ఈ రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయ్.
Share your comments