భారతదేశ అగ్ర కంపెనీ టాటా కన్సల్టెన్సీ లో ఉద్యోగం చేసే అవకాశాన్ని పొందండి.ముఖ్యంగా మీరు ఫ్రెషర్ అయితే ఈ సువర్ణవకాశం మీదే. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తుదారులు TCS నిర్వహించే BPS నియామక పరీక్షలో వారి పనితీరు ఆధారంగా వివిధ స్థానాలకు ఎంపిక చేయబడతారు. ఈ పరీక్ష న్యూమరికల్, వెర్బల్,రీసనింగ్ వంటి అంశాలపై నిర్వహించబడుతుంది.
టాటా కంపెనీ యొక్క అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యూనిట్లు, కాగ్నిటివ్ బిజినెస్ ఆపరేషన్స్ (CBO), బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ (BFSI), మరియు లైఫ్ సైన్సెస్ కొరకు ప్రస్తుతం TCS రిక్రూట్‌మెంట్ 2022 కోసం ఫ్రెషర్‌లను రిక్రూట్ చేస్తున్నాయి.
TCS Recruitment 2022: ఎవరు అర్హులు
2020, 2021 మరియు 2022 సంవత్సరాలలో తమ డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు, అయితే మూడు నెలల కంటే తక్కువ ఉద్యోగ అనుభవం ఉన్నవారు మాత్రమే పరిగణించబడతారు.
ఎంపికైన విద్యార్థులకి ఇది ఫుల్ టైం పొసిషన్ మరియు అభర్ధులు తగిన షిఫ్ట్ వర్క్ షెడ్యూల్‌లో పని చేయగలగాలి.
అభ్యర్థి ప్రాంతంలో మహమ్మారి దృష్టాంతం యొక్క తీవ్రతను బట్టి, పరీక్ష ఆన్‌లైన్ ప్రొక్టోర్డ్ మోడ్‌లో లేదా అయాన్ డిజిటల్ సెంటర్‌లలో నిర్వహించబడుతుంది. ఈ నియామకాన్ని పారదర్శకంగా ఉండేలా పటిష్ట విధానాన్ని అనుసరిస్తామని సంస్థ పేర్కొంది.
TCS Recruitment 2022:విద్యార్హత
B.Com
BA
BAF
BBI
BBA
BBM
BMS
BSc in information technology, computer science, or general
BCA
BCS
BPharm
MPharm
ఉద్యోగ బాధ్యతలు:
ఎంపిక చేయబడిన అభ్యర్థులు TCS యొక్క గ్లోబల్ క్లయింట్‌లతో వివిధ రంగాలలో పని చేస్తారు, అంతే కాకుండా,
బ్యాంకింగ్ మరియు బీమా
ప్రయాణం, పర్యాటకం మరియు ఆతిథ్యం
ప్రీ-సేల్స్
లైఫ్ సైన్సెస్ మరియు హెల్త్‌కేర్
మీడియా మరియు సమాచార శాస్త్రాలు
టెలికాం
TCS Recruitment 2022: దరఖాస్తు చేయడం ఎలా
అభర్ధులు ముందుగా TCS NextStep పోర్టల్‌లో అకౌంట్ ని క్రియేట్ చేసి రఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.అభ్యర్థులు తప్పనిసరిగా తమ కళాశాల ID లేదా ఆఫ్-క్యాంపస్ IDని లింక్ చేయబడిన వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలి.
అభ్యర్థులు మరిన్ని వివరాలకై అధికారిక వెబ్ సైట్ ని సందర్శించండి.
మరిన్ని చదవండి.
Share your comments