విద్యార్థి దశలో అతి ముఖ్యమైనదిగా పదవ తరగతిని పరిగణిస్తారు. విద్యార్థి దశలో ముందుకు సాగి జీవిత లక్ష్యాలను అందుకునేందుకు పదవి తరగతి నుండే బాట మొదలవుతుంది. విద్యార్థులకు మరియు తల్లితండ్రులకు పది పరీక్షలు ఒకగుర్తింపు అందించగలవు.
తెలంగాణలో పది పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు నేటితో తెరపడింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు 2024 పది వార్షిక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేసారు.
ఈ ఏడాది 5 లక్షల మంది విద్యార్థులు పది పరీక్షలు రాసినట్లు బుర్ర వెంకటేశం తెలిపారు. పరీక్షకు హాజరైనవారిలో 91.31% విద్యార్థులు ఉతీర్ణత సాధించగా, ఈ ఏడాది బాలికలు బాలురు మీద పైచెయ్యి సాధించారు. బాలికలు 93.23 శాతం ఉతీర్ణత సాధించగా, బాలురు 89.42 శాతం మంది ఉతీర్ణత సాధించినట్లు వెంకటేశం పేర్కొన్నారు.
అత్యధిక పాస్ పర్సెంట్ తో నిర్మల్ జిల్లా మొదటిస్థానం సాధించగా వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. నిర్మలజిల్లలొ పాస్ అయినవారి శాతం 99.05 మరియు వికారాబాద్ జిల్లాలో పాస్ శాతం 65.10 శాతంగా ఉంది. మార్చిలో జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 4,94,207 విద్యార్థులు హాజరయ్యారు, వీరిలో 4,51,272 విద్యార్థులు ఉతీర్ణులయ్యారు. ఇకపోతే సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుండి జూన్ 13 వరకు నిర్వహిస్తారని బుర్ర వెంకటేశం తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది.
Share your comments