తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. మొత్తానికి 114 ఖాళీల భర్తీ కొరకు ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు వేతనం వచ్చేసి నెలకు రూ.30 వేల నుండి రూ.58 వేల వరకు ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసస్ కార్యాలయం, హైదరాబాద్ వారు వెల్లడించారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు కనీస వయస్సు అనేది 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు అనేది 44 సంవత్సరాలు ఉండాలి. భర్తీ కొరకు వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్లో 59 ఖాళీలు ఉన్నాయి మరియు వేతనం వచ్చేసి రూ.58,850. ల్యాబ్ టెక్నిషియన్ లో 11 ఖాళీలు మరియు రూ.31,040 వేతనం, ఫార్మసిస్ట్ లో 43 ఖాళీలు మరియు వేతనం వచ్చేసి రూ.31,040.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్హత ఏమిటంటే, అభ్యర్థులు ఎంబీబీఎస్, డీఫార్మసీ, బీడీఎస్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికేట్ కోర్సుల్లో ఉతీర్ణత సాధించి ఉండాలి. ఈ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ దరఖాస్తులను కేవలం ఆఫ్ లైన్ విధానంలో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది, ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి వీలులేదు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా పిడిఎఫ్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పిడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకున్న తరువాత, అందులో ఉన్న అన్ని వివరాలను పూర్తిగా నింపాలి.
ఇది కూడా చదవండి..
ఏపీ పశుసంవర్ధక శాఖలో రాత పరీక్షలేకుండా ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకొండి
అప్లికేషన్ పూర్తిగా నింపిన తరువాత ఆ దానిని పోస్ట్ ద్వారా జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, హైదరాబాద్ , అయిదో అంతస్తు, హాస్టల్ బిల్డింగ్, ఈఎస్ఐ హాస్పటల్, సనత్ నగర్, నాచారం, హైదాబాద్ ఈ అడ్రస్ కు పంపాలి. ఈ నెల 28లోగ దరఖాస్తులు పైన ఇచ్చిన అడ్రెస్ కు చేరేలా చూసుకోవాలి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల అనగా మర్చి 28వ తేదీ అనేది చివరి తేదీ. అర్హులైన విద్యార్థులు మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ లేదా లోపల ఆఫ్లైన్ విధానంలో పైన సూచించిన అడ్రస్ కు దరఖాస్తులను సమర్పించాలని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి..
Share your comments