Education

TG AGRICET 2024: బీఎస్సి, బీటెక్ అగ్రికల్చర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల....

KJ Staff
KJ Staff

తెలంగాణ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు 2024-25 విద్యాసంవత్సరానికి గాను అగ్రికల్చర్ బిఎస్సి మరియి బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు భర్తీ చెయ్యనున్నారు. ఈ మేరకు ప్రొఫెసర్ జయశంఖర్ తెలంగాణ యూనివర్సిటీ వారు వివరాలను వెల్లడించారు.

ఈ పరీక్ష ద్వారా అగ్రికల్చర్ లో డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులకు అగ్రికల్చర్ బీఎస్సి మరియు అగ్రికల్చర్ బిటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు https://www.pjtsau.edu.in/ వెబ్సైట్ లోకి వెళ్లి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఆగష్టు 9 వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

అగ్రిసెట్ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు డిప్లొమా (అగ్రికల్చర్ / సీడ్ టెక్నాలజీ/ ఆర్గానిక్ అగ్రికల్చర్/ ఆర్గానిక్ ఫార్మింగ్) లో ఉతీర్ణులై ఉండాలి, అదే విధంగా అగ్రి ఇంజనీరింగ్ సెట్ రాసేవారు డిప్లొమా (అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ) ఉతీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 1400 రూపాయిలు రుసుము చెల్లించవలసి ఉంటుంది, ఇక ఎస్సి, ఎస్టి మరియు దివ్యంగులు మాత్రం 700 రూపాయిలు చెల్లించవలసి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆగష్టు 9 చివరి తేదీ.

ప్రవేశపరీక్ష ద్వారా అబ్యర్థుల ఎంపిక జరుగుతుంది. మొత్తం 100 మార్కుల ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు, మరియు ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, నిజామాబాదు జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చెయ్యనున్నారు. ఆగష్టు 24 వ తేదీన, 2:30PM నుండి 4:10PM వరకు పరీక్ష నిర్వహించనున్నారు.

Share your comments

Subscribe Magazine

More on Education

More