Education

TS DSC Answer Key 2024: తెలంగాణ డిఎస్సి ఆన్సర్ కీ విడుదల

KJ Staff
KJ Staff

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి పరిక్ష నిర్వహించింది. తాజాగా ఈ పరీక్షకు సంభందించిన ఆన్సర్ కీ విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ చెక్ చేసుకోవడానికి https://tgdsc.aptonline.in/tgdsc/ ఈ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రిలిమినరీ ఆన్సర్ కీ పై అభ్యన్తరాలను కూడా ఆన్లైన్ విధానాల్లో తెలియచెయ్యవచ్చు. ప్రిలిమినర్ ఆన్సర్ కీ తోపాటు, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు కూడా టీజిపిఎస్సి కమిషన్ అధికారిక వెబ్సైటులో అందుబాటులో ఉంచింది.

పోయిన నెల 18 న రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం డిఎస్సి పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలు జులై 18 న మొదలై ఆగష్టు 5వ తారీఖున ముగిసాయి. తెలంగాణ డిఎస్సి పరీక్షకు మొత్తం 2,79,957 మంది అబ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా 2,45,263 మంది అబ్యర్ధులు పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT ) పోస్టులకు 92.10 % అభ్యర్థులు హాజరయ్యారు. జులై 18 నుండి ప్రారంభమైన ఈ పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. సీబీఆర్‌టీ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో TG DSC 2024 పరీక్షలు నిర్వహించారు.

తెలంగాణలో మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 28వ తేదీన పాఠశాల విద్యాశాఖ టీజీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఎస్జీటీలు 6,508 కాగా.. స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల గడువు జూన్‌ 20వ తేదీతో ముగిసింది. మొత్తం 2.79 లక్షల మంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.

Share your comments

Subscribe Magazine

More on Education

More