ఉపాధ్యాయ అర్హతకు అవసరమైన అర్హత పొందడానికి నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 తెలంగాణ రాష్ట్ర విద్య శాఖ విడుదల బుధవారం విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తులు మార్చ్ 27 నుండి ఏప్రిల్ 10 వరకు స్వీకరించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం నిర్వహించే, TS TET 2024 నోటిఫికేషన్ తెలంగాణ విద్య శాఖ బుధవారం విడుదల చేసింది. మే 20 నుండి జూన్ 3 వరకు జరిగే ఈ పరీక్షలకు మార్చ్ 27 నుండి ఏప్రిల్ 10 వ తారీఖు వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడం కోసం tstet2024.aptonline.in లింక్ ద్వారా రిజిస్టర్ అయ్యి పరీక్ష రుసుమును చెల్లించవలసి ఉంటుంది.
అర్హతలు:
పరీక్షను మొత్తం రెండు పేపర్లుగా ఉంటుంది. పేపర్-1 కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో రెండు సంవత్సరాల డిప్లొమా లేదా నాలుగు సంవత్సరాల బ్యాచేలర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. పేపర్-2 అభర్ధులు తప్పనిసరిగా బ్యాచేలర్స్ డిగ్రీతో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో రెండు సంవత్సరాల డిప్లొమా పూర్తిచెయ్యాలి. అంతే కాకుండా ఆర్ట్స్ లేదా సైన్స్ విభాగంలో 4 సంవత్సరాల బ్యాచేలర్స్ డిగ్రీ మరియు ఇంటిగ్రేటెడ్ బిఎడ్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పరీక్ష రుసుము రూ.400 ఆన్లైన్లో చెల్లించాలి. TET పరీక్ష ఆఫ్ లైన్ లో రెండున్నర గంటల కొనసాగుతుంది. ప్రశ్నలు అన్ని ముల్టీపుల్ ఛాయస్ విధానంలో ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి ప్రతీ ప్రశ్నకు 1మార్క్ చొప్పున 150 మార్కులకు పరిక్ష నిర్వహిస్తారు.
- Read more:
-
ఇండియాలోని కుబేరుల జాబితా ఇదే....
Share your comments