తెలంగాణ పోలీస్ పరీక్షకు హాజరైన విద్యార్థులు మొదటి సరిగా నెగిటివ్ మార్కింగ్ ప్రకటించడం తో చాల మంది అభ్యర్థులు అయోమయానికి గురి అయ్యారు తమ కేటగిరి పరంగా ప్రిలిమ్స్ క్వాలిఫై మార్కులను తగ్గించాలని గత కొత్త కలం గ నిరసన తెలుపుతున్నారు . ఈ సమయం TSLPRB అభ్యర్థులకు శుభవార్తను అందించింది , క్యాటగిరి పరంగా క్వాలిఫైయింగ్ మార్కులను తగ్గిస్తూ అక్టోబర్ 2 న నోటిఫికేషన్ విడుదల చేసింది .
నోటిఫికేషన్ ప్రకారం 200 మార్కులకు గాను ఓసీలకు 30 శాతం అనగా 60 మార్కులు, బీసీకి 25 శాతం(50 మార్కులు), ఎస్సీ,ఎస్టీలకు 20 శాతం అనగా 40 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు.తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ల మీద నోటిఫికేషన్ లను విడుదల చేస్తుంది .
ప్రభుత్వం విడతలవారీగా ఆయా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఆర్థిక శాఖ అనుమతులు పొందిన పోస్టులకు వెంట వెంటనే నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలీస్ శాఖలో భారీగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌లతో ఇతర పోస్టులు ఉన్నాయి. ఇటీవల మరిన్ని పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి జారీ చేసింది. త్వరలో వైద్య శాఖకు సంబంధించిన పోస్టులు భర్తీ కానున్నాయి. ఈవిషయాన్ని ఇటీవల మంత్రి హరీష్‌రావు ప్రకటించారు.
Share your comments