తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎస్సై మరియు కానిస్టేబుల్ పోస్టుల కొరకు రాత పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పోస్టుల్లో ఇటీవలి సాంకేతిక విభాగానికి చెందిన డ్రైవర్, మెకానిక్, అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ కానిస్టేబుల్ అభ్యర్థులకు తుది రాత పరీక్షను హైదరాబాద్ కేంద్రంలో నిర్వహించనున్నారు.
హైదరాబాద్ కేంద్రంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు తుది రాత పరీక్షను ఏప్రిల్ 2వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) మంగళవారం అనగా మార్చి 28వ తేదీన ప్రకటించారు. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటికే హాల్ టికెట్లను కూడా అభ్యర్థుల కొరకు విడుదల చేసింది. అభ్యర్థులు వెంటనే వెళ్లి మీ యొక్క హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోండి.
అభ్యర్థులు తుది రాత పరీక్షకు అర్హత సాధించినవారు తమ హాల్ టికెట్లను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి స్వయంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఛైర్మన్ వివి శ్రీనివాసరావు అర్హులైన అభ్యర్థులు వారి హాల్ టిక్కెట్లను మార్చి 28వ తేదీ అర్ధరాత్రి నుండి మార్చి 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి..
అధిక ధరలు పలుకుతున్న నిమ్మ రైతులకు తీరని కష్టాలు..
అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత, కచ్చితంగా హాల్‌టికెట్‌పై పాస్పోర్ట్ సైజ్ ఫొటోను అతికించి పరీక్షకు హాజరు కావాలి, లేదంటే వారిని పరీక్ష రాయడానికి అనుమతించరని స్పష్టం చేశారు. అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడంలో ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కుంటున్న 93937 11110 లేదా 93910 05006 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఛైర్మన్ వివి శ్రీనివాసరావు సూచించారు.
ఇది కూడా చదవండి..
Share your comments