Education

TSPSC GROUP 1:నేటి నుండి TSPSC గ్రూప్ 1 పోస్టుల దరఖాస్తు పక్రియ ప్రారంభం

S Vinay
S Vinay

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 1 పోస్టుల నియామకాల కొరకు దరఖాస్తు పక్రియను ప్రారంభించింది.అభర్ధులు నేటి నుండి TSPSC అధికారక వెబ్సైటు కి వెళ్లి దరఖాస్తు చేసుకోగలరు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రూప్ 1(GROUP1)పోస్టులకు గత వారం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబందించి రిజిస్ట్రేషన్ పక్రియ నేడు ప్రారంభం కానుంది.దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 31 2022.ఈ నియామకం ద్వారా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 503 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనుంది.

పోస్టులకు దరఖాస్తు చేయడానికి ముందు, అభ్యర్థులు TSPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR)లో తమ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. OTRలో ఇప్పటికే నమోదు చేసుకున్న వారు లాగిన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఏవైనా సవరణలు ఉంటే
అభ్యర్థులు మార్పులు చేసుకోవచ్చు.TSPSC ID మరియు పుట్టిన తేదీని ఉపయోగించి అభర్ధులు వారి ప్రొఫైల్‌కు లాగిన్ అవ్వొచ్చు. (ఒకవేళ అభ్యర్థి TSPSC IDని మరచిపోయినట్లయితే TSPSC వెబ్‌సైట్‌ని సందర్శించి, ఆధార్‌ మరియు పుట్టిన తేదీ వివరాలతో TSPSC-IDని పొందగలరు.

TSPSC GROUP 1 NOTIFICATION: ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మే 2

దరఖాస్తుకి చివరి తేదీ: మే 31

ప్రిలిమినరీ పరీక్ష తేదీ: జూలై/ ఆగస్టు 2022

అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ: పరీక్షకు 7 రోజుల ముందు

TSPSC GROUP 1 NOTIFICATION:దరఖాస్తు రుసుము
జనరల్ కేటగిరీకి చెందిన అభర్ధులకి ప్రోసెసింగ్ రుసుము రూ. 200 మరియు పరీక్ష రుసుము రూ. 120 ను ఆన్ లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన SC, ST, BC, EWS, PH & మాజీ సైనికులకు మరియు నిరుద్యోగ అభర్ధులకి ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు.

అభర్ధులు ఇక్కడ ఇవ్వబడిన TSPSC అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

www.tspsc.gov.in

మరిన్ని చదవండి.

BSF Recruitment 2022:బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఉద్యోగ ఖాళీలు...నెలవారి జీతం రూ.1,42,400 వరకు పొందండి!

Share your comments

Subscribe Magazine

More on Education

More