Government Schemes

Government Scheme :కన్యా సుమంగళ యోజన, అమ్మాయిలకు నెల నెల రూ.4500?

Srikanth B
Srikanth B
Kanya Sumangala Yojana, Rs.4500 per month for girls is true ?
Kanya Sumangala Yojana, Rs.4500 per month for girls is true ?

ప్రభుత్వ పతాక పేరుతో సామాన్య ప్రజలను దోచుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది , అలాంటి వార్తనే మీరు ఇప్పుడు చదవబోయేది .

సోషల్ మీడియా పుణ్యమాని వాస్తవాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో వచ్చే వార్తలను చూసి నిజమని నమ్మి మోసపోయే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది ఇప్పుడు ఇలాంటి వార్తనే సోషల్ మీడియాలో షేర్ అవుతుంది . ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త పథకం 'కన్యా సుమంగళ యోజన' కింద ఆడబిడ్డలున్న కుటుంబాలకు నెలకు రూ.4,500 అందజేస్తుందనే న్యూస్‌ ఒకటి వైరల్‌గా మారింది.


కన్యా సుమంగళ యోజన కింద ప్రతి కుటుంబంలో ఆడపిల్ల ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం నెలకు రూ.4,500 ప్రోత్సాహకం ను అందజేస్తోందని సర్కారీ వ్లాగ్ అనే యూట్యూబ్ ఛానెల్‌ వీడియో అప్‌లోడ్ చేసింది. దీని పై నిజ నిర్దారణ చేపట్టిన పీఐబీ ఫాక్ట్ చెక్ టీమ్ ఇది నకిలీ వార్త అని కొట్టి పారేసింది , ప్రజలు ఎవ్వరు నమ్మి మోసపోవద్దని సూచించింది .

కాగా ప్రధానమంత్రి కన్యా సుమంగళ యోజన అనేది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. రాష్ట్రంలోని బాలికల విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం 25 అక్టోబర్ 2019న లక్నోలో ప్రారంభించింది.

కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకం అమలు చేయడం లేదని , ఇలాంటి వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీం తన అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది.

Share your comments

Subscribe Magazine