డబ్బులు ఉండి కాస్త పొదుపు చేయాలి అనుకునే వారికోసం దేశంలో అనేక పొదుపు పథకాలు ఉన్నాయి వాటిలో అతి ముఖ్యమైనవి మరియు అధిక వడ్డీ శాతాన్ని అందించేవి పోస్ట్ ఆఫీస్ పథకాలు , మనలో చాల మంది బ్యాంకు సేవింగ్ ఖాతాలో డబ్బులను పొదుపు చేస్తుంటారు అయితే దీని ద్వారా లబ్దిదారులకుయ్ లభించేది కేవలం 2.5 శాతం నుంచి 3 శాతం మాత్రమే వడ్డీ లభిస్తుంది అదే పోస్ట్ ఆఫీస్ అందించే పథకాలలో వడ్డీ శాతం 6 కంటే అధికం గానే ఉంటుంది . అలాటి పథకాలలో ఒకటయిన గ్రామ్ సురక్ష యోజన గురించి మేము మీకు ఇక్కడా వివరిస్తాము .
19 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వయస్సు వారు ఎవరైనా గ్రామ్ సురక్ష యోజన పథకం క్రింద పెట్టుబడి పెట్టవచ్చు . ఈ పథకం క్రింద నెలకు కనిష్టముగా రూ . 50 నుంచి గరిష్టముగా రూ . 1500 వరకు పెట్టుబడి పెట్టవచ్చు . ప్రీమియం మొత్తాన్ని 3 నెలల వాయిదా లేదా 6 నెలల వాయిదా రూపంలో చెల్లించవచ్చు . రూ . 1500 నెలకు ప్రీమియం చెల్లించడం ద్వారా చెల్లించిన వ్యక్తికి 80 సంవత్సరాల వయస్సు లో గరిష్టముగా 35 లక్షలను అందుకుంటాడు .
మీకు లోన్ అవసరమైనట్లయితే నాలుగు సంవత్సరాల తర్వాతే లభిస్తుంది. లోన్ తీసుకున్నట్లయితే పాలసీ వ్యవధిలో ప్రీమియం చెల్లించడంలో డిఫాల్ట్ అయితే, మీరు పెండింగ్‌లో ఉన్న ప్రీమియం మొత్తాన్ని చెల్లించడం ద్వారా దాన్ని మళ్లీ పథకాన్ని ప్రారంభించవచ్చు .
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)2022: @ 436 తో ప్రీమియం ప్రయోజనాలు ఏమిటి ?
గమనిక : ఏదైనా పాలసీలో డబ్బులు చెల్లించేటప్పుడు ,పాలసీకి సంబందించిన పూర్తి సమాచారాన్ని సంబందించిన శాఖ వద్ద మాత్రమే తీసుకోండి . దళారులకు డబ్బులు చెల్లించి మోసపోవద్దు .
Share your comments