ప్రతి మనిషి తానూ కస్టపడి కూడబెట్టిన డబ్బును పెట్టుబడి పెట్టి లాభం పొందాలి అనుకుంటాడు, ప్రస్తుత కాలంలో భూమిని మించిన గొప్ప పెట్టుబడి లేదు. భూమి మీద పెట్టిన పెట్టుబడి ఎప్పుడు లాభదాయకమే అంటారు. భూమి సమాజంలో ఒక గౌరవ చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. ఈ రోజుల్లో భూమి విలువ కేవలం పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అధికంగానే ఉంటుంది, ఇటువంటి పరిస్థితులు ఉండడం వలన భూమి విలువ పెరిగి ఎక్కువమంది దీని మీద పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారు. అయితే భారత దేశంలోని కొన్ని నిబంధనలకు అనుగుణంగా ఒక వ్యక్తి ఎంత భూమిని కొనుగోలు చెయ్యాలో సూచించారు. మన దేశంలో ఒక వ్యక్తి ఎంత వ్యవసాయ భూమి కలిగి ఉండచో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలాగైతే భూమివిలువ ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుందో భూమి కొనుగోలు నిబంధలను ప్రాంతాలు మరియు రాష్ట్రాల మధ్య మారుతూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం మన దేశంలో ఒకప్పటి జమిందారీ వ్యవస్థ. ఎక్కువ భూములు కలిగిన వారిని జమిందారులుగా భావించేవారు, అయితే ఈ జమిందారీ వ్యవస్థ రద్దైన తరువాత, జాతీయ స్థాయిలో భూ సంబంధిత చట్టాల్లో కొన్ని మార్పులు చెయ్యబడ్డాయి , దీని ప్రకారం ప్రతి రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించబడ్డాయి. ఈ హక్కులకు అనుగుణంగా రాష్ట్రాలు భూమి కొనుగోళ్లలో గరిష్ట పరిమితులను విధించాయి, ఇవి రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ భూమి ఎవరు కొనుగోలు చెయ్యచ్చు అనేది కూడా ప్రభుత్వమే చెబుతుంది. ఈ నిబంధనలు ఎప్పుడు మారుతూనే ఉంటాయి, అయితే వ్యవసాయేతర భూమికి ఇటువంటి నిబంధనలు ఏమి లేవు.
ప్రస్తుతం అన్య రాష్ట్రాల్లో భూమి కొనుగోలు సంబంధిత నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి. కేరళలో 1963 భూ సంస్కరణల చట్టం ప్రకారం పెళ్లికాని వారు 7.5 ఎకరాలు లేదంటే అంతకన్నా తక్కువ భూమిని మాత్రమే కొనుగోలు చెయ్యగలరు ఒకవ్యక్తి కాకుండా 5 మంది కుటుంబ సభ్యులు ఉన్నవారు 15 ఎకరాల వరకు భూమిని కొనుగోలు చెయ్యవచ్చు. మహారాష్ట్రలో భూమి కొనుగోలకి సంబంధించి ఒక వ్యక్తి గరిష్టంగా 54 ఎకరాలు మాత్రమే కొనుగోలు చెయ్యాలి. అలాగే పశ్చిమ బెంగాల్లో గరిష్టంగా 24.5 ఎకరాల భూమిని కొనుగోలు చెయ్యవచు. మహారాష్ట్రలోని నిబంధన కర్ణాటకలో కూడా వర్తిస్తుంది, ఇక్కడకూడా ఒక వ్యక్తి గరిష్టంగా 54 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చెయ్యవచు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 ఎకరాలకు వరకు భూమిని కొనుగోలు చేసేవిధంగా ఈ చట్టాన్ని రూపొందించారు.
హిమాచల్ ప్రదేశ్లో 32 ఎకరాల భూమిని కొనుగోలు చెయ్యవచు, ఉత్తర్ ప్రదేశ్లో ఒక వ్యక్తి 12.5 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చెయ్యవచు. బీహార్లో మాత్రం వ్యవసాయ మరియు వ్యవసాయేతర భూమికి ఒకటే నిబంధన ఇక్కడ ఒక వ్యక్తి 15 ఎకరాలు వరకు మాత్రమే కొనుగోలు చెయ్యగలడు. గుజరాత్లో వ్యాపారులు మాత్రమే భూమిని కొనుగోలు చెయ్యాలి మిగిలిన వారికి అనుమతి లేదు. ఒక ఎన్ఆర్ఐ లేదంట వేరేదేశం వారు ఇక్కడ వ్యవసాయ భూమిని కొనుగోలు చేసేందుకు అనుమతి లేదు, అంతే కాకుండా తోటలు మరియు ఫార్మ్ హౌస్ వంటివి కూడా కొనుగోలు చెయ్యలేరు. అయితే వీరికి ఒక సడలింపు ఉంది వేరే వ్యక్తి భూమిని వీరికి బహుమతిగా ఇవ్వచ్చు.
Share your comments