Government Schemes

కోళ్లఫారం పెట్టడానికి 50% సబ్సిడి 50 లక్షల రుణం.... ఎలాగో చుడండి

KJ Staff
KJ Staff

కోళ్ల పరిశ్రమకు గ్రామీణ ప్రాంతాలు పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలోని ఎంతోమంది రైతులు కోళ్లఫారాలను నెలకొలిపి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అయితే కోళ్లఫారం మొదలుపెట్టేందుకు ప్రారంభ పెట్టుబడి ఎక్కువుగానే ఉంటుంది. ఫారం యొక్క విస్తీర్ణం మరియు ప్రాంతాన్ని బట్టి ఈ పెట్టుబడి మొత్తం మారుతూ ఉంటుంది. ఇటువంటివారి కోసం కేంద్ర ప్రభుత్వం కేంద్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధిశాఖ (నేషనల్ లైవ్స్టాక్ మిషన్) అనే కార్యక్రమం నిర్వహిస్తుంది. దేశంలోని పాలు, గుడ్డు, మాంశం యొక్క ఉత్పత్తిని పెంచడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం.

ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్రం కోళ్లఫారం మొదలుపెట్టాలనుకునేవారికి రుణాలు మరియు సబ్సిడీలను అందిస్తుంది. అయితే రుణాలు పొందేదుకు అందరూ అర్హులే, స్వయం సహాయక సంఘాలు, పారిశ్రామికవేత్తలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజషన్స్, రైతు సహకార సంఘాలు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, కోళ్ల పెంపకం కేంద్రాలు, ఇలా అందరు దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ పథకానికి అర్హులైనవారికి అన్ని జాతీయ బ్యాంకుల్లోను రుణాలు మంజూరు చేస్తారు. అయితే ఈ రుణానికి పొందాలనుకునేవారి పేరు మీద కనీసం ఒక ఎకరం భూమి ఉండటం తప్పనిసరి, సరిపడినంత భూమి లేకపోతే, భూమిలో లీజుకు తీసుకోని ఈ రుణానికి దరఖాస్తు చేసుకోవాలి, ఇటువంటి సందర్భాల్లో భూమి యజమానులతో కలిసి జాయింట్ గా లోన్ తీసుకోవాలి.

దరఖాస్తు చేసుకోవడం ఎలా?

ఈ పథకం పొందడం కోసం ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, ఇందుకోసం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ వెబ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత అవసరమైన పాత్రలను మీ అప్లికేషన్లో పొందుపరచాలి. ఈ పథకాన్ని పొందేందుకు డీపీఆర్(డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ) అంటే కోళ్ల ఫారం మొదలుపెట్టడానికి అయ్యే ఖర్చు, మరియు ఇతర వివరాలను ఈ రిపోర్ట్లో పొందుపరచాలి. దీనితోపాటు ఈ కింద చెప్పిన పాత్రలను కుడా అప్లోడ్ చెయ్యవలిస్ ఉంటుంది

-మీ యొక్క ఆధార కార్డు (బ్యాంక్ అకౌంట్ తో జతచెయ్యబడినది),-
-భూమి యొక్క పత్రాలు మరియు ఫోటో,
-పాన్ కార్డు, మరియు ఓటర్ ఐడి కార్డు,
-బ్యాంకు ఖాతాకు చెందిన రెండు క్యాన్సిల్డ్ చెక్కులు,
-మ్యాండేటరి ఫారం,
-చిరునామా ధ్రువీకరణ పత్రం,
-కులధ్రువీకరణ పత్రాలు,
-విద్యార్హతల పత్రాలు,
-స్కాన్ చేసిన సంతకం ఫోటో,

వీటితోపాటు ఒకవేళ కోళ్ల ఫారం నిర్వహణలో శిక్షణ పొంది ఉంటే దీనికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా ఈ పాత్రలతోపాటు జతచేయ్యాలి. ఈ డాక్యూమెంట్లు ఎన్నో అప్లోడ్ చేసి, సబ్మిట్ చెయ్యాలి. తరువాత ఎప్పటికప్పుడు వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ స్టేటస్ తెలుసుకోవచ్చు. డిపిఆర్ తయారీలో చాలా జాగ్రత్త పాటించాలి, ఫారం ప్రారంభించడానికి అయ్యే ఖర్చు, ఫారం నిర్వహించాడనికి అయ్యే ఖర్చు ఇలా మొత్తం అన్నిటికి అయ్యే ఖర్చు గురించి స్పష్టంగా పొందుపరచాలి, లేకుంటే బ్యాంకులు లోన్ రిజెక్ట్ చేసే ప్రమాదం ఉంటుందీ, దీంతోపాటు సిబిల్ స్కోర్ కూడా బలంగా ఉండేలా చూసుకోవాలి లేకుంటే బ్యాంకుల నుండి రుణాలు పొందడం చాలా కష్టంగా మారుతుంది.

ఈ పథకానికి రాష్ట్రాలు నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి, ఆన్లైన్ లో చేసిన దరఖాస్తులు, మీ ఏరియాలోని ప్రభుత్వ బ్యాంకులవద్దకు వెళ్తాయి.ఈ పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మీ ప్రాంతంలోని పశుసంవర్ధక శాఖ అధికారిని సంప్రదించవలసి ఉంటుంది.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More