Government Schemes

LATEST UPDATE! PM KISAN UPDATE : 11 వ విడత పొందడానికి ఇంట్లో నుండి eKYC లింక్ చేయండిలా ..

Srikanth B
Srikanth B

ఎలాంటి సమస్య లేకుండా పిఎమ్ కిసాన్ యోజన యొక్క 11 విడత డబుళ్లు  పొందాలనుకుంటే, వెంటనే మీ eKYC  పూర్తి చేయండి. ఈకెవైసి వివరాలను పూర్తి చేయకుండానే, 11వ  వాయిదా మీ బ్యాంకు ఖాతాలోకి రాకపోవచ్చు. గత ఏడాది రైతులందరికీ ఈకేవైసీని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

పిఎమ్ కిసాన్ లబ్ధిదారునికొరకు ఈకెవైసి తప్పనిసరి

గత ఏడాది, మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద నమోదైన రైతులందరికీ eKYC  తప్పనిసరి చేసింది.  ఈ eKYC ని ఆధార్ సెంటర్లలో, మీసేవ సెంటర్లలో ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ జాతః చేయడం ద్వారా మీ యొక్క eKYC ద్రువీకరించబడుతుంది .

మీరు ఇంట్లో నుండి కూడా దీనిని చేసుకోవచ్చు దీని కోసం మీ మొబైల్ ఫోన్ లో పీఎం కిసాన్ (PM KISAN ) యాప్ ను డౌన్లోడ్ చేసుకొని అందులో మీ యొక్క వివరాలను నమోదు చేయాలి. 

పిఎమ్ కిసాన్ యోజనలో eKYC  ఎలా పూర్తి చేయాలి:

మీ ఈకెవైసి ని పూర్తి చేయడం కొరకు దిగువ ఇవ్వబడ్డ దశలను అనుసరించండి;

పిఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ కు వెళ్లండి.

ఫార్మర్స్ కార్నర్ ఆప్షన్ వద్ద కుడివైపున, మీరు ఈకెవైసి లింక్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి

దీని తరువాత మీ ఆధార్ ఎంటర్ చేయండి మరియు సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి.

అవసరమైన వివరాలను నింపి సబ్మిట్ చేయండి. ఒకవేళ ప్రతిదీ సక్రమంగా జరిగినట్లయితే, అప్పుడు ఈకెవైసి పూర్తవుతుంది, ఒకవేళ కానీ పక్షం లో మీరు సమీప ఆధార్ సేవా కేంద్రాన్ని సంప్రదించాల్సి ఉంటుంది..

ప్ర ధాన మంత్రి కిసాన్ 11వ వాయిదా తేదీ

అధికారుల ప్రకారం, తరువాత విడుత ఏప్రిల్ 2022 మొదటి వారంలో విడుదలచేయ నున్నట్లు తెలిపారు

పిఎం కిసాన్ పథకానికి అనర్హుల జాబితా

వ్యవసాయేతర భూములు కల్గినవారు

దిగువ పేర్కొన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కేటగిరీలకు చెందిన రైతు;

రాజ్యాంగ బద్ద పదవులలోఉన్న మాజీ మరియు ప్రస్తుత అధికారులు , మాజీ మరియు ప్రస్తుత మంత్రులు/ రాష్ట్ర మంత్రులు మరియు లోక్ సభ/ రాజ్యసభ/ రాష్ట్ర శాసనసభలు/ రాష్ట్ర శాసన మండలిసభ్యులు, మునిసిపల్ కార్పొరేషన్ల మాజీ మరియు ప్రస్తుత మేయర్లు, జిల్లా పంచాయితీల మాజీ మరియు ప్రస్తుత చైర్ పర్సన్లు

నెలవారీ పెన్షన్ రూ.10,000 కంటే ఎక్కువగా ఉన్న అన్ని సూపర్ యాన్యుయేటెడ్ లేదా రిటైర్డ్ పెన్షనర్లు (మల్టీ టాస్కింగ్ స్టాఫ్/క్లాస్ ఐవి/గ్రూప్ డి ఉద్యోగులు మినహాయించి) పై కేటగిరీకి చెందినవారు

కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/కార్యాలయాలు/డిపార్ట్ మెంట్ ల యొక్క సర్వింగ్ లేదా రిటైర్డ్ అధికారులు మరియు దాని ఫీల్డ్ యూనిట్ లు సెంట్రల్ లేదా స్టేట్ పిఎస్ ఈలు మరియు అటాచ్డ్ ఆఫీసులు/అటానమస్ ఇనిస్టిట్యూషన్ లు అదేవిధంగా స్థానిక సంస్థల యొక్క రెగ్యులర్ ఉద్యోగులు (మల్టీ టాస్కింగ్ స్టాఫ్/క్లాస్ ఐవి/గ్రూపు డి ఉద్యోగులను మినహాయించి),లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, సిఎ మరియు ఆర్కిటెక్ట్ వంటి వృత్తులకు లైసెన్సులు  కలిగినవారు కూడా అనర్హులు .

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More