Government Schemes

పోస్ట్ ఆఫీస్ బంపర్ స్కీం రూ. 333 డిపోసిట్ తో 17 లక్షలు మీ సొంతం

KJ Staff
KJ Staff

ఎంతో మంది భవిష్యత్తు అవసరాల కోసం డబ్బు పొదుపుచేస్తూ ఉంటారు, ఇటువంటి వారికి పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఎన్నో స్కీమ్స్ చింతలేని ఇన్వెస్ట్మెంట్ మార్గాన్ని కల్పిస్తుంది. పోస్ట్ స్కీమ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా మరొక్క ప్రయోజనం ఏమిటంటే మీ డబ్బుకు పూర్తి రక్షణ కల్పించడంతో పాటు, బలమైన రాబడి పొందే అవకాశం ఉంటుంది. ఈ తరహాలో పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఒక స్కీం ద్వారా 333రూ పెట్టుబడి పెట్టడంతో రూ. 17 లక్షల వరకు రాబడి పొందవచ్చు. ఇది పెట్టుబడిదారులకు భారీ లాభాన్ని అందించే స్కీం. అది ఎలాగో తెలుసుకుందాం.

డబ్బు సంపాదించే ప్రతి ఒక్కరు, దానిని జాగ్రత్తగా ఖర్చు చేస్తూ, భవిష్యత్తు అవసరాల కోసం దాచిపెట్టుకునేందుకు యత్నిస్తారు. ఇంకొంత మంది ఈ డబ్బును ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బును రేటింపు చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇటువంటివారికి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపోసిట్ స్కీం ఎంతో అనువైనది. దీనినే ఆర్ డి అనికూడా పిలుస్తారు. భారత దేశంలోని ప్రజలు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు పొదుపు అవసరాల కోసం పోస్ట్ ఆఫీస్ అనేక రకాల చిన్న పొదుపు స్కీమ్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అటువంటి వాటిలో రికరింగ్ డిపోసిట్ స్కీం ఒక్కటి.

రికరింగ్ డిపోసిట్ స్కీం ద్వారా రోజువారీ పొదుపు చేసినట్లైతే 10 సంవత్సరాలలో 17 లక్షల మొత్తాన్ని పొందవచ్చు. మీరు ఈ పధకంలో రోజుకు 333 రూ. అంటే నెలకు 10,000 పెట్టుబడి పెడితే, ఒక సంవత్సరానికి 1.20 లక్షల వరకు డబ్బు పొదుపుచేసుకోగలరు. ఈ స్కీం లో పెట్టుబడి పెట్టిన డబ్బుకు ప్రస్తుతం వడ్డీరేటు 6.7 శాతంగా ఉంది. ఇలా చూసుకుంటే ఐదు సంవత్సరానికి 1. 20 లక్షల చొప్పున ఐదు సంవత్సరాలకు 6,00000.రూ పొదుపుచేసుకోగలరు. ఈ సమయానికి 6.7 శాతం వడ్డీ 1,13, 659 అవుతుంది ఈ విధంగా ఐదు సంవత్సరాలలో 7,13,659 రిటర్న్స్ రూపంలో మీకు లభిస్తుంది. అదే పది సంవత్సరాలు మీరు పెట్టుబడి పెడుతూ వస్తే 10 ఏళ్లకు 12 లక్షల రూపాయిలు అసలు, దినికి వడ్డీ రూ. 5,08, 546 కలిసి 17 లక్షలు మీ చేతికి వస్తాయి. ఈ స్కీం కి సంబంధించిన పూర్తివివరాలు కోసం మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ లేదా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ వెబ్సైటు ద్వారా తెలుసుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine