దేశంలోని ప్రజలు తమ భవిష్యత్తు కోసం డబ్బులను పొదుపు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన వృధాప్యనికి వచ్చినప్పుడు వారికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కానీ చాలా మందికి డబ్బులు ఎలా ఆపదుపు చేయాలో తెలీదు. తెలియని వాటిలో తమ డబ్బులను పెట్టి మోసపోతుంటారు. కానీ ప్రజలకు నమ్మకం ఇచ్చే ఎల్ఐసి కొన్ని రకాల పాలసీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఎల్ఐసిలో పిల్లల నుండి పేదవారి వరకు అందరికి ఉపయోగపడేలా వివిధ రకాల పాలసీలు ఎల్ఐసి అందిస్తుంది.
వృధాప్యంలో తమ భవిష్యత్తు కోసం ఆలోచించే వీరికి ఎల్ఐసి జీవన్ శాంతి పాలసీని ఎల్ఐసి సంస్థ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రతి పాలసీల ఈ పాలసీకి ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ పాలసీలో ఒక్కసారి పెట్టుబడి పెడితేచాలు. ఈ పాలసీ ద్వారా నెలకు రూ. లక్ష కన్నా ఎక్కువ పెన్షన్ రూపంలో పొందవచ్చు. కానీ ఇది పెట్టుబడి పెట్టిన దానిపై ఆధారపడి ఉంటుంది.
ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టాలి అనికునే వారికీ ఈ పథకం అనేది చాలా మంచిది. ఇటీవల యాన్యుటీ రేట్లను ఎల్ఐసి సవరించింది, దీనివలన వాళ్ళ ప్రీమియంపై పాలసీదారులకు ఎక్కువ పెన్షన్ వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత ప్రలకు ఎదురయ్యే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎల్ఐసి ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇది కూడా చదవండి..
ఎల్.ఐ.సి పాలసీ: ఈ ఎల్.ఐ.సి పాలసీ ఎంచుకుంటే రూ. 15,00,000 వరకు రిటర్న్స్
నెలకు లక్ష రూపాయలను పెన్షనుగా పొందాలి అనుకుంటే గనుక కోటి రూపాయలను 12 ఏళ్లకు పెట్టుబడి పెట్టాలి. ఇలా పెట్టుబడి పెట్టడం వలన 12 ఏళ్ళు పూర్తయిన తర్వాత 1.06 లక్షల రూపాయలు పెన్షన్ కింద ప్రతి నెల మనకు లభిస్తాయి. ఒకవేళ నెలకు 50 వేల రూపాయలు సరిపోతాయి అనుకుంటే గనుక మీరు 50 లక్షల రూపాయలను 12 ఏళ్లకు పెట్టుబడి పెట్టుకుంటే సరిపోతాది.
ఈ పథకం అనేది నెలవారీగా ఆదాయాన్ని పొందాలనుకునే వారికీ ఉపయోగపడుతుంది. ఒకవేళ ఉద్యోగి ముందుగా కనుక పదవీ విరమణ చేస్తే, వాళ్ళకి కూడా ఈ పథకం పనిచేస్తుంది. కాబట్టి వృధాప్యంలో సమస్యలు ఎదుర్కోకుండా ఉండటానికి ఇలాంటి పాలసీలు తిస్కుకోవడం చాలా శ్రేయస్కరం. ఇలా ఒక్కసారి పెట్టుబడి పెట్టి జీవితాంతం పెన్షన్ పొందవచ్చు.
ఇది కూడా చదవండి..
Share your comments