Government Schemes

ఆడపిల్లల కొరకు ఎల్ఐసి పథకం..రోజుకు రూ.121 ఇన్వెస్ట్ చేసి రూ.27 లక్షలు పొందండి..

Gokavarapu siva
Gokavarapu siva

ప్రముఖ భీమా సంస్థ అయిన ఎల్ఐసి ప్రజల కోసం అనేక భీమా పథకాలను అందుబాటులోకి తీసుకువస్తు ఉంటుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభత్వాలు మహిళల కొరకు అనేక పథకాలను అందిస్తున్నాయి. ఇప్పుడు ఆడపిల్లల భవిష్యత్తు కొరకు ఎల్ఐసి ఈ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. మీ అమ్మాయిల భవిష్యత్తు గురించి ముందుగానే ప్లాన్ చేసుకునే వారికి ఈ పథకం ఒక మంచి ఎంపిక. ఈ పథకం యొక్క వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎల్ఐసి అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ అద్భుతమైన పథకం పేరు ఎల్ఐసి కన్యాదాన్. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ అమ్మాయి యొక్క చదువు, కెరీర్ మరియు పెళ్లి వంటి వాటి గురించి దిగులు పడకుండా వారి భవిష్యత్తుని సురక్షితంగా ఉంచవచ్చు. ఎల్ఐసి అందిస్తున్న ఈ ఎల్ఐసి కన్యాదాన్ పథకం ద్వారా తల్లిదండ్రులు తమ కుమార్తె పెళ్లి కొరకు అధిక మొత్తంలో డబ్బును పొదుపు చేసుకోవచ్చు.

ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ప్రతి నెల రూ. 3,400 డిపాజిట్ చేయాలి. ఈవిధంగా డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ కాల వ్యవధి పూర్తయిన తరువాత రూ. 27 లక్షలను పొందవచ్చు. నెల రూ. 3,400 అనగా ఒక్కో రోజుకు రూ.121 డిపాజిట్ చేవలసి ఉంటుంది. రోజుకు రూ.121ను పెట్టుబడి పెట్టలేము అనుకునే వారికి రోజుకు రూ. 71 ఇన్వెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. దీని ద్వారా రూ.14 లక్షలను 25 ఏళ్లకు పొందే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..

PMVVY Scheme Update : ఈ పథకం లో చేరితే .. నెల నెల రూ.9,250 పెన్షన్!

ఈ పాలసి పొందాలనుకునే వ్యక్తికి కనీస వయస్సు అనేది 30 ఏళ్ళు ఉండాలి మరియు కుమార్తె వయస్సు అనేది ఒక సంవత్సరం ఉండాలి. ఈ పాలసీని 13 నుండి 25 సంవత్సరాల వరకు మీరు తీసుకోవచ్చు.

వినియోగదారులు ఈ పాలసీని పొందాడనికి కొన్ని డాక్యూమెంట్లను సమర్పించాల్సి వస్తుంది. ఆ డాక్యూమెంట్స్ ఏమిటంటే నివాస ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మరియు దరఖాస్తు ఫామ్ ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధంగా మెచ్యూరిటీ సమయానికి పాలసీదారుడు రూ. 27 లక్షలు పొందుతాడు. ఒకవేళ ఏదైనా ప్రమాదంలో పాలసీదారుడు మరణిస్తే రూ.10 లక్షలు అందిస్తారు. సాధారణ మరణం సంభవిస్తే రూ.5 లక్షలు వారి కుటుంబానికి అందిస్తారు.

ఇది కూడా చదవండి..

PMVVY Scheme Update : ఈ పథకం లో చేరితే .. నెల నెల రూ.9,250 పెన్షన్!

Related Topics

lic policy

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More