Government Schemes

మహిళా సమ్మాన్‌ పొదుపు పథకం ప్రారంభం .. రూ.2 లక్షల వరకు డిపాజిట్‌, ప్రత్యేకతలు ఇవే !

Srikanth B
Srikanth B
Mahila Samman Saving Certificate scheme started from April 1
Mahila Samman Saving Certificate scheme started from April 1

2023-24 బడ్జెట్ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం మహిళా బఛత్ పాత్ర యోజన అనే పథకాన్ని తీసుకువచ్చింది , ఈ పథకం క్రింద మహిళలలు గరిష్టంగా 2 లక్షల వరకు పొదుపు ఖాతాను తెరవవచ్చు , ఈ పథకం 2 సంవత్సరాలు అంటే 2025 వరకు అమలులో టుంది మరియు పొదుపు పై గరిష్టంగా 7. 5 % వడ్డీ లభిస్తుంది .

పథకం ప్రత్యేకతలు :

మహిళల పొదుపు ఖాతాపై గరిష్టంగా 7. 5 % వడ్డీ ని అందిస్తుంది .

18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలు కూడా ఈ ఖాతాను తెరవవచ్చు .

డబ్బులు అవసరమైతే మధ్యలోనే విత్ డ్రా చేసుకోవచ్చు .

దేశంలోని 1.59 లక్షల పోస్టాఫీసుల్లోనూ ఈ పథకాన్ని మహిళలు, బాలికల కోసం అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది

మహిళలు, బాలికల కోసం కేంద్రం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం తీసుకొచ్చింది. శనివారం నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి దేశంలోని అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులోకి వచ్చింది.

వైఎస్సార్‌ కల్యాణమస్తు దరఖాస్తుకు ఇప్పుడు 30 రోజులే గడువు .. !

ఈ పథకంలో ఎలా చేరాలి ?

మహిళలు, బాలికలు తమ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి మహిళా సమ్మాన బచత్‌ పత్ర యోజన ఫామ్‌ తీసుకోవాలి. పర్సనల్‌, ఆర్థికపరమైన, నామినీ తదితర వివరాలతో ఆ దరఖాస్తు ఫామ్‌ నింపాలి.

గుర్తింపు, చిరునామా ధృవీకరణ పత్రాలు అంటే ఆధార్‌, పాన్‌ జిరాక్స్‌ ప్రతులను దరఖాస్తు ఫామ్‌తోపాటు సమర్పించాలి. ఎంత డిపాజిట్‌ చేయ తలపెట్టారో నిర్ణయించుకున్న మొత్తం క్యాష్‌ రూపంలో గానీ, చెక్‌ రూపంలో గానీ డిపాజిట్‌ చేయాలి. పెట్టుబడి మదుపు చేసినందుకు రుజువుగా ఇచ్చే సర్టిఫికెట్‌ను తీసుకోవాలి

 

పథకం గురించి :
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం, 1 ఫిబ్రవరి నాడు, 7.5 శాతం స్థిర వడ్డీ రేటుతో మహిళల కోసం 'మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్'ని ప్రకటించారు, రెండు సంవత్సరాల కాలానికి కేంద్ర బడ్జెట్ 2023 సందర్భంగా ప్రారంభించారు .

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1 ఫిబ్రవరి 2023, బుధవారం, మహిళల కోసం 'మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్'ను ప్రకటించారు. ఇది మార్చి 2025 వరకు రెండు సంవత్సరాల కాలానికి ఒకసారి కొత్త చిన్న పొదుపు పథకం.

వైఎస్సార్‌ కల్యాణమస్తు దరఖాస్తుకు ఇప్పుడు 30 రోజులే గడువు .. !

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More