Government Schemes

మహిళలకు ఎల్ఐసీ నుండి కొత్త పాలసీ..రూ.4 లక్షల వరకు రిటర్న్స్

Gokavarapu siva
Gokavarapu siva

ప్రముఖ భీమా సంస్థ అయిన ఎల్ఐసి ప్రజల కోసం అనేక భీమా పథకాలను అందుబాటులోకి తీసుకువస్తు ఉంటుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభత్వాలు మహిళల కొరకు అనేక పథకాలను అందిస్తున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) భీమా సంస్థ మహిళల కొరకు ఒక కొత్త పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పాలసీకి సంబంధించి మొత్తం సమాచారాన్ని తెలుసుకోండి.

ఈ కొత్త ఎల్ఐసీ పాలసీ పేరు వచ్చేసి ఎల్ఐసీ ఆధార్ శిల. కేవలం మహిళలు మాత్రమే ఈ ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీ యొక్క లబ్ధిని పొందడానికి ఉంటుంది. ఈ పాలసీ ద్వారా మహిళలకు రక్షణతో పాటు సేవింగ్స్ కూడా అందుతాయి. ఈ ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీ అనేది ఇండివిజ్యువల్, సేవింగ్స్, పార్టిసిపేటింగ్ మరియు నాన్ లింక్డ్.

ఒకవేళ పాలసీ ఎంచుకున్న మహిళా కనుక మరణిస్తే, ఆ డబ్బులను నామినీగా ఎవరి పేరు ఐతే ఉందో వారికి ఎల్ఐసీ చెల్లిస్తుంది. పాలసీ తీసుకున్న మహిళ ఐదేళ్ల తర్వాత గనుక మరణిస్తే సమ్ అష్యూర్డ్తో పాటు లాయల్టీ అడిషన్ కూడా ఆమెకు లభిస్తుంది, లేదా పాలసీ తీసుకున్న మహిళా ఐదేళ్ల లోపు గనుక మరణిస్తే నామినికి సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ ఎల్ఐసీ చెల్లిస్తుంది. ఒకవేళ మహిళలు ఈ పథకం ద్వారా రుణ సదుపాయం పొందాలి అనుకుంటే, రెండేళ్లు పూర్తి ప్రీమియంలు చెల్లిస్తే వారు ఈ సదుపాయం కూడా పొందవచ్చు.

ఇది కూడా చదవండి..

సగం ధరకే రైతులకు ట్రాక్టర్.. కేంద్రం కొత్త పథకం

మహిళలతో పాటు ఈ పథకానికి బాలికలు కూడా అర్హులే. ఈ ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీ పొందాలనుకునే మహిళలకు కనిష్ట వయస్సు వచ్చేసి 8 ఏళ్ళు ఉండాలి మరియు గరిష్ట వయస్సు వచ్చేసి మహిళలకు 55 ఏళ్ళు ఉండాలి. ఈ ఎల్ఐసీ ఆధార్ శిల పథకం యొక్క పాలసీ టర్మ్ అనేది 10 ఏళ్ల నుండి 20 ఏళ్ల వరకు ఉంది. ఈ ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీని కనిష్టంగా రూ.2,00,000 నుంచి గరిష్టంగా రూ.5,00,000 వరకు తీసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపుల గడువు అనేది నెలకు, మూడు లేదా ఆరు నెలలకు మరియు ఒక సంవత్సరానికి చెల్లించుకోవచ్చు.

ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీని ఒక మహిళ 20 ఏళ్ల టర్మ్ తో రూ.3,00,000 సమ్ అష్యూర్డ్‌తో తీసుకుంటే, ప్రతి సంవత్సరం ఆమె రూ.10,959 ప్రీమియం చెల్లించాల్సిఉంటుంది. అంటే ఒక రోజుకి రూ.30. పాలసీ టర్మ్ పూర్తయ్యి మెచ్యూరిటీ సమయానికి రూ.3,97,000 రిటర్న్స్ ఆమెకు అందుతాయి. దీనితో పాటు ఆమెకు బోనస్ కూడా లభిస్తుంది.

ఇది కూడా చదవండి..

సగం ధరకే రైతులకు ట్రాక్టర్.. కేంద్రం కొత్త పథకం

ఆధార్ శిల పాలసీ యొక్క ప్రయోజనాలు

➨లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆధార్‌శిలా పాలసీలో పెట్టుబడి పెడితే, పాలసీ హోల్డర్‌కు రుణ సౌకర్యం
   లభిస్తుంది. కానీ పాలసీని కొనుగోలు చేసినప్పటి నుండి 3 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం ఉన్నప్పుడే దాని ప్రయోజనం
   అందుబాటులో ఉంటుంది .

➨ఇది కాకుండా, పాలసీదారు మరణిస్తే, నామినీ హామీ మొత్తం కంటే 7 రెట్లు వరకు తిరిగి పొందవచ్చు.

➨మీరు ఆధార్‌శిలా పాలసీకి చెల్లించిన ప్రీమియంపై కూడా పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.

➨దీనితో పాటు, పాలసీని కొనుగోలు చేసిన 15 రోజులలోపు మీకు ఈ స్కీమ్ నచ్చకపోతే లేదా కొన్ని కారణాల వల్ల మీరు దీన్ని మరింత
   కొనసాగించకూడదనుకుంటే, మీరు దీన్ని కూడా రద్దు చేయవచ్చు.

ఇది కూడా చదవండి..

సగం ధరకే రైతులకు ట్రాక్టర్.. కేంద్రం కొత్త పథకం

Share your comments

Subscribe Magazine