Government Schemes

సగం ధరకే రైతులకు ట్రాక్టర్.. కేంద్రం కొత్త పథకం

Gokavarapu siva
Gokavarapu siva

మన భారతదేశంలో ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. ఆలాంటి మన భారతదేశానికి రైతులు వెన్నెముక్కగా నిలుస్తున్నారు. మనది వ్యవసాయ దేశమైనప్పటికీ ఇక్కడ రైతుల పరిస్థితి దారుణంగా మారుతుంది. దేశంలో వ్యవసాయం చేయడానికి పెట్టుబడుల ఖర్చులు పెరగడంతో, రైతులకు వ్యవసాయం చేయడం కష్టతరంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు కూడా చేపడుతున్నాయి.

రైతులను ఆదుకునేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి కావలసిన విత్తనాలు, ఎరువులు మరియు పురుగు మందులపై అనేక విధాలుగా సబ్సిడీలను అందిస్తున్నాయి. మరియు వారిని ఆర్ధికంగా ఆదుకోవడానికి క్రెడిట్ కార్డులు అందించి వారికి సహాయపడుతుంది. దీనికి మరో అడుగు ముందుకు తీసుకువెళ్తూ కేంద్ర ప్రభుత్వం ట్రాక్టర్లపై కూడా సబ్సిడీలను అందజేస్తోంది.

వ్యవసాయం చేయడానికి రైతులకు ట్రాక్టర్ అనేది చాలా ముఖ్యమైన యంత్రం. ట్రాక్టర్ మనకు విత్తనాలు నాటడం నుండి కోత వరకు అనేక పనులలో ఉపయోగపడుతుంది. దీనిని వాడటం వలన రైతులకు అన్ని పనులు సులువు అవుతాయి. కానీ అందరు రైతులు దీనిని కొనలేరు. కాబట్టి అలాంటి వారికి సహాయపడేందుకు కేంద్ర ప్రభత్వం ఈ స్కీంను అందుబాటులకి తీసుకువచ్చింది. కానీ చాలా మంది రైతులకు ఈ పథకం గురించి తెలియదు.

ఇది కూడా చదవండి..

పోస్ట్ ఆఫీస్ కొత్త పథకం... రూ.50 లక్షలు హామీ మరియు రుణ సౌకర్యం

పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు ట్రాక్టర్లపై 50 శాతం సబ్సిడీని అందిస్తుంది. రైతులు ఈ పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ కింద ట్రాక్టర్లను కొనుగోలు చేసి సబ్సిడీని పొందవచ్చు. ఈ పథకం ద్వారా దేశంలో చిన్న మరియు మధ్య తరగతి రైతులకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ స్కీం కింద రైతులు కేవలం సగం ధర చెల్లించి ట్రాక్టర్లను కొనుగోలు చేసుకుంటున్నారు.

ఈ పథకం దేశవ్యాప్తంగా అందరి రైతులకు వర్తిస్తుంది. ముందుగా రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ దరఖాస్తును రైతులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కూడా చేసుకుని ఈ పథకం లబ్ధిని పొందవచ్చు. ఆఫ్‌లైన్‌లో ఐతే రైతులు తమ దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి..

పోస్ట్ ఆఫీస్ కొత్త పథకం... రూ.50 లక్షలు హామీ మరియు రుణ సౌకర్యం

ఈ స్కీంకు దరఖాస్తు చేసుకోవడానికి రైతులకు ఆధార్ కార్డు, పాన్ కార్డ్, ఓటరు ID కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్‌ మరియు భూమి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు మెుబైల్ నంబర్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ ఖాతా వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

రైతులు ఈ పథకం ద్వారా సబ్సిడీ పొందడానికి గత ఏడేళ్లలో ఆ రైతు అటువంటి ట్రాక్టర్ కొని ఉండకూడదు. ఒక రైతు తన పేరు మీద ఒక ట్రాక్టర్ కు మాత్రమే సబ్సిడీని పొందగలడు. ఒక కుటుంబం నుండి ఒక మనిషి మాత్రమే సబ్సిడీ కొరకు దరఖాస్తు చేసుకోగలడు. ఈ పథకానికి అర్హులు కావాలంటే రైతులు వారి పేరు మీదనే వ్యవసాయ భూమిని కలిగి ఉండాలి.

ఇది కూడా చదవండి..

పోస్ట్ ఆఫీస్ కొత్త పథకం... రూ.50 లక్షలు హామీ మరియు రుణ సౌకర్యం

Related Topics

tractor subsidy

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More