తెలంగాణ రాష్ట్రము ఏర్పడినప్పనుంచి అనేక సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది . కుల వృత్తులు చేసుకునే వర్గల వారికీ ఇంటికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడానికి సన్నధం అయ్యింది .
బీసీ కుల, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం అందించే రూ.లక్ష ఆర్థిక సాయం కార్యక్రమాన్ని జూన్ 9న సంక్షేమ సంబురాల సందర్భంగా లాంఛనంగా ప్రారంభించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ఈ మేరకు బుధవారం సంగారెడ్డి నుంచి వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు వీడియో సమావేశంలో పాల్గొనగ, హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి వీడియో సమావేశం నిర్వహించారు.
2023-24 ఖరీఫ్ పంటల మద్దతు ధర పెంచిన కేంద్రం ... ఏ పంటకు ఎంతో తెలుసా ?
తెలంగాణలోని నాయీ బ్రాహ్మణులు, రజకులు, కమ్మరి, మేదరి, విశ్వబ్రాహ్మణులకు రూ.లక్ష ఆర్థిక సహాయం కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు, దీనికి గత మంత్రివర్గంలో ఆమోదం కూడా లభించింది. ఈ పథకాన్ని పొందేందుకు వీలుగా తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమల్కర్ అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
ఈ పథకాన్ని ఈ నెల 9వ తేదీన సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు, అర్హులైన వ్యక్తులు ఈ ఆర్థిక సహాయం కోసం https://tsobmms.cgg.gov.in/వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Share your comments