రైతులకు పెట్టుబడి సాయం అందించే కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం కిసాన్ , రైతులకు 3 దఫాలలో సంవత్సరానికి 6000 పెట్టుబడి సాయం అందించే ఈ పథకం క్రింద ఇప్పటివరకు 13 విడతలలో రైతులకు సాయం అందించింది ప్రభుత్వం ఇప్పుడు 14 వ విడత ద్వారా రైతులకు మరో 2000 ఆర్థిక సాయాన్ని అందించనుంది , అయితే పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే రైతులు e-kyc ప్రక్రియ పూర్తి చేయవలసి ఉంటుంది .
ఈ e-kyc ప్రక్రియ పూర్తి చేయడంలో ఇబ్బంది పడుతున్న రైతుల కోసం ప్రభుత్వం ఇంటి వద్ద నుంచే తమ ఫోన్ ద్వారా ప్రక్రియను పూర్తి చేయడానికి కొత్త యాప్ ను తీసుకువచ్చింది దీని ద్వారా రైతు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా e-kyc ప్రక్రియను పూర్తి చేసే వెసులుబాటును అందించింది , ఎప్పుడు రైతులు కేవలం ప్లే స్టోర్ లో వెళ్లి పీఎం కిసాన్ యాప్ ను డౌన్లొడ్ చేసుకొని సంబందించిన బీ ఆధార్ నంబరు నమోదు చేస్తే.. ఓటీపీ వస్తుంది. ఆధార్‌కు లింకైన నంబరుకు ఓటీపీ రాదు. పీఎం కిసాన్ దరఖాస్తు చేసినప్పుడు ఏ నంబరు ఇస్తే దానికి మాత్రమే వస్తుంది. బీ ఆ ఓటీపీని నమోదు చేస్తే ముఖ ఆధారిత హాజరు మాదిరిగా వస్తుంది. అందులో ముఖం చూపుతూ కళ్లు కదిలించాలి. అదే రైతు, అవే కళ్లు అయితే ఓకే చేస్తుంది. ఈ విధంగ రైతు e -kyc పూర్తి చేయవచ్చు .
ఇది కూడా చదవండి .
జూన్ రెండో వారంలోగ నైరుతి రుతుపవనాలు..
PM కిసాన్ యోజన: దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు:
ఆధార్ కార్డు
మొబైల్ ఫోన్ నంబర్
ల్యాండ్ హోల్డింగ్ పేపర్లు
బ్యాంక్ ఖాతా వివరాలు
ఆదాయ ధృవీకరణ పత్రం.
PM కిసాన్ యోజన: ఆన్‌లైన్‌లో స్టేటస్ ఎలా తనిఖీ చేయాలి
ప్రారంభంలో, మీరు pmkisan.gov.in వెబ్‌సైట్ యొక్క అధికారిక పేజీకి వెళ్లడం అవసరం.
తర్వాత, హోమ్‌పేజీలో ఉన్న 'ఫార్మర్ కార్నర్' ఎంపికపై క్లిక్ చేయండి .
ఆపై, 'రైతులు' విభాగంలో ఉన్న 'బెనిఫిషియరీ స్టేటస్' లింక్‌ని ఎంచుకోవడానికి కొనసాగండి.
ఇది కూడా చదవండి .
Share your comments