Government Schemes

పి.ఏం. సమ్మాన్ నిధి మీకు చెరలేదా? అయితే ఫిర్యాదు చేయండి...

KJ Staff
KJ Staff
PM Kisan
PM Kisan

రైతుల కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలు అందిస్తోంది. వీటి ద్వారా అన్నదాతలకు నేరుగానే లబ్ధి చేకూరుతోంది. నేరుగా అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు వేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చాలా మంది రైతులకు ఊరట కలుగుతోంది.

మోదీ సర్కార్ పీ.ఎం. కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద ప్రతి ఏడాది రైతులకు రూ.6 వేలు అందించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ డబ్బులు ఒకేసారిగా కాకుండా విడతలవారీగా వేయనున్నట్లు వెల్లడించింది. మూడు విడతల్లో అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో ఈ డబ్బు  జమ చేయనున్నట్లు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. అంటే విడతకి రూ.2 వేల చొప్పున రైతులకు పీఎం కిసాన్ డబ్బులు అందుతున్నాయి.

మోదీ సర్కార్ ఇటీవలనే 8వ విడత డబ్బు రూ.2000లను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. కాగా కొంత మంది రైతులకు ఈ డబ్బు జమ కాలేదు. అటువంటి రైతులందరూ చింతించాల్సిన పనిలేదు. డబ్బు జమ కానీ రైతులు ఫిర్యాదు చేయాలి అని తెలిపింది. అప్పుడు మీ డబ్బులు మీకు జమ చేస్తాము అని ప్రకటించింది.

డబ్బులు జమ కానీ రైతుల ఫిర్యాదు సహాయార్థం 011-24300606 నెంబర్‌కు కాల్ చేసి పీఎం కిసాన్ డబ్బులు రాలేదని ఫిర్యాదు చేయమని తెలిపింది. ఈ నెంబర్ మాత్రమే కాకుండా ఇంకా పలు హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఉన్నాయి. 18001155266155261011-23381092011 23382401 వంటి నెంబర్లకు కూడా కాల్ చేయొచ్చు.

ఫోన్ కాల్ కాకుండా ఇమెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు. దీని కోసం మీరు pmkisan-ict@gov.inకు ఇమెయిల్ పంపాల్సి ఉంటుంది. ఇకపోతే ఇంకా ఈ స్కీమ్‌లో చేరని రైతులు ఉంటే.. వారు ఇప్పుడు కూడా ఈ పథకంలో ఆన్‌లైన్ ద్వారా చేరొచ్చు.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More