Government Schemes

PM SVANIDHI :పీఎం స్వనిది యోజన ... 10000 ఆర్థిక సాయం .. లిస్టులో మీ పేరు ఉందోలేదో తెలుసుకోండి !

Srikanth B
Srikanth B
PM SVANIDHI
PM SVANIDHI

 

దేశంలోని ప్రధాన పట్టణాలలో అధిక మంది చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. కరోనా సమయం లో లక్డౌన్ కారణంగా నిలిచి పోయిన వారి వ్యాపారాలను తిరిగి ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా రూ . 10000 పది వేల వరకు వర్కింగ్ కాపిటల్ లోన్ ను అందించడానికి ఆదేశించి పీఎం స్వనిది యోజన ను ప్రారంభించింది .

 

ప్రధాన లక్ష్యం :

(i) రూ. 10,000 వరకు వర్కింగ్ క్యాపిటల్ లోన్‌ను సులభతరం చేయడానికి; (ii) రెగ్యులర్ రీపేమెంట్‌ను ప్రోత్సహించడం; మరియు (iii) డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సహించడం . దేశవ్యాప్తముగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ పథకం అమలులో ఉంది .

కావాల్సిన అర్హత పత్రాలు :

ఏదయినా అర్బన్ లోకల్ బాడీ లేదా మున్సిపాలిటీ వారు జారీ చేసిన విధి వ్యాపారుల లైసెన్సు లేదా వేండర్ సర్వే లిస్ట్ లో పేరు ఉంటె మీరు ఈ పథకం క్రింద అర్హులు ;


బ్యాంకు అకౌంట్ వివరాలు

పాన్ మరియు ఆధార కార్డు

పైన పేర్కొన్న అన్ని ధ్రువ పత్రాలను తీసుకొని సమీప బ్యాంకు ను సంప్రదించండి . పీఎం స్వనిది యోజన ఆత్మ నిర్భర భారత్ క్రింద లభించే ఈ లోన్ మొత్తం పై 7 శాతం వార్షిక వడ్డీ తో బ్యాంకు చిరు వ్యాపారులు 10000 వరకు ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేకుండా రుణ సదుపాయం లభిస్తుంది .

భారత దేశంలోని టాప్ 5 వ్యవసాయ పథకాలు ఇవే !

 

వెండర్ సర్వే (విధి వ్యాపారుల సర్వే ) లో మీ పేరు ఉందొ లేదో తెలుసుకోండి ఇలా :

స్టెప్ 1
https://pmsvanidhi.mohua.gov.in/Schemes/ULBList వెబ్ సైట్ ను సందర్శించండి .

స్టెప్ 2 :
పీఎం స్వనిది వెబ్సైటు అర్బన్ లోకల్ బాడీ సెక్షన్ ను ఎంచుకోండి .


స్టెప్ 3 :
పీఎం స్వనిది వెబ్సైటు అర్బన్ లోకల్ బాడీ సెక్షన్ లో కుడివైపు రాష్ట్రము ను ఎంచుకోండి . ఇక్కడ మీకు అన్ని మున్సిపాలిటీ ల పేర్లు కనిపిస్తాయి .


స్టెప్ 4 : సంబంధిత మున్సిపాలిటీ ను ఎంచుకోండి . ఇందులో మీ పేరు సెర్చ్ చేయండి . ఇక్కడ మీ పేరు కనుక ఉన్నట్లయితే మీరు ఏ పథకానికి అర్హులు .

లేనిచో సంబంధిత మునిసిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించండి .

భారత దేశంలోని టాప్ 5 వ్యవసాయ పథకాలు ఇవే !

Related Topics

PMSVANIDHI PM KISAN YOJANA

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More