Government Schemes

పోస్ట్ ఆఫీస్ "కిసాన్ వికాస్ పత్ర స్కీం" ద్వారా మీ ఆధాయం డబల్ చేసుకోండి:

KJ Staff
KJ Staff

సమాజంలోని ప్రతిఒక్కరు తాము సంపాదించే ఆధాయం నుండి ఎంతోకంత భవిష్యత్తు దాచిపెడుతుంటారు. మారుతున్న జీవనశైలి మరియు ఆర్ధిక అవసరాల కారణంగా జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం చాల కష్టం. తమకు వచ్చే ఆధాయం మరియు అవసరాలకు తగ్గట్టు మనలో చాల మంది డబ్బులను ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ తో కుడి ఉన్న వాటిలో చేసేవారు కొందరు అయితే, ఎటువంటి రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ చేసే వారు మరికొంత మంది.

మీరు కూడా ప్రమాదం లేని పెట్టుబడి కోసం చూస్తున్నట్లైతే, భారత పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన కిసాన్ వికాస్ పత్ర స్కీం ఒక చక్కటి ఎంపిక. కొడుకు చదువుకోసమో, కూతురి పెళ్లికోసమో మరియు ఎటువంటి కుటుంబ అవసరాలకోసమైన సరే ఈ స్కీం మీకు ఉపయోగపడుతుంది. ఈ స్కీం ఒక స్థిరమైన పెట్టుబడి ఎంపికలాగ మాత్రమే కాకుండా మీ పెట్టుబడి డబల్ చెయ్యడంలో మీకు సహాయపడుతుంది.

కిసాన్ వికాస్ పత్ర స్కీం:

భరత్ పోస్ట్ ఆఫీస్ వారు ఈ స్కీం ను 1988 లో రైతుల కోసం మొదలు పెట్టారు, మొదట ఈ స్కీం టెన్యూర్ కొద్దీ కాలం మాత్రమే ఉండగా కాలక్రమేణా ఈ పథకం కాలాన్ని 115 నెలలకు పెంచారు అంటే సుమారు 9.5 సంవత్సరాలు. మొదట్లో కేవలం రైతుల కోసం మాత్రమే ఉన్న ఈ స్కీంలో ఇప్పుడు అందరూ తమ డబ్బును పెట్టుబడిగా పెట్టె విధంగా సవరించబడింది.


పెట్టుబడి ఎంత?

కిసాన్ వికాస్ పత్ర స్కీం లో డబ్బును పెట్టుబడి పెట్టేందుకు, కనీసం రూ.1000 తో మొదలుపెట్టాలి, మీ ఆర్ధిక అవసరాలు అలాగే ఆదాయం మేరకు ఈ స్కీం లో డబ్బులు ఇన్వెస్ట్ చెయ్యొచ్చు. ప్రస్తుతం ఈ స్కీం వార్షిక వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. డబ్బులు పెట్టుబడి పెట్టిననాటి నుండి 115 నెలల తర్వాత మీరు పెట్టిన పెట్టుబడి రెండింతలు అవుతుంది

స్కీం అర్హతలు :

ఈ స్కీం పొందడం కోసం 18 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరు అర్హులే అలాగే ఒకే వ్యక్తి తమ ఆర్ధిక అవసరాల మేరకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలను పొందవచ్చు. కనీసం 1000 రూపాయలతో మొదలుపెట్టి ఎంతవరకునైనా పెట్టుబడి పెట్టె అవకాశం ఉంటుంది. ఖాతాను తెరిచేందుకు ఆధార కార్డు, రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు అవసరం. ఈ స్కీం కాలపరిమితి కంటే ముందుగానే స్కీం ఉపసంహరించుకుందాం అనుకునేవారు రెండున్నర సంవత్సరాల తర్వాత పెట్టుబడిని మొత్తం తిరిగిపొందవచ్చు. తమ డబ్బును సుదీర్ఘ కాలం వరకు పెట్టుబడి పెట్టాలి అనే ఆలోచన ఉన్నవారికి కిసాన్ వికాస్ పత్ర స్కీం ఒక మంచి ఎంపిక.

Read More:

Share your comments

Subscribe Magazine