తపాలా కార్యాలయం కూడా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త రకాల స్కీంలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ పోస్ట్ ఆఫీస్ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం వలన ప్రజలకు నష్టం కలుగదు, ఎందుకనగా ఈ పథకాలు అన్ని కేంద్ర ప్రభత్వం పర్యవేక్షణలో జరుగుతాయి. కాబట్టి ప్రజలు ధైర్యంగా వీటిలో పెట్టుబడులు పెట్టచ్చు. గ్రామీణ ప్రజలకు సేవింగ్స్ కొరకు ఈ పోస్ట్ ఆఫీస్ పథకాలు అనేవి చాలా ఉత్తమం.
తపాలాశాఖ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఆదాయాన్ని పెంచి వారి భవిష్యత్తును సురక్షితం చేయడానికి అనేక రకాల పొదుపు పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ తపాలాశాఖ అందుబాటులోకి తీసుకువచ్చిన పథకాలు ప్రజలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే పథకం పేరు గ్రామ సురక్ష యోజన పథకం. ఈ పథకం ఎక్కువగా ప్రజాదరణ పొందింది.
ఈ గ్రామ సురక్ష యోజన పథకంలో మీరు ప్రతి నెల రూ.1500 పెట్టుబడిపెట్టి రూ.35 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యక్తి కనిష్ట వయస్సు అనేది 19 సంవత్సరాలు ఉండాలి, మరియు గరిష్టంగా 55 సంవత్సరాలు వయస్సు ఉన్న వ్యక్తులు పెట్టుబడులు పెట్టుకోవచ్చు.
ఇది కూడా చదవండి..
ఆడపిల్లల కొరకు ఎల్ఐసి పథకం..రోజుకు రూ.121 ఇన్వెస్ట్ చేసి రూ.27 లక్షలు పొందండి..
రోజుకు దాదాపు రూ.50 చొప్పున నెలకు రూ.1,515 చెల్లించడం ద్వారా రూ. మీరు 35 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. ఈ పాలసీతో మీరు 55 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత రూ.31,60,000 తిరిగి పొందవచ్చు. ఈ పాలసీని ముందుగానే సరెండర్ చేస్తే, వారికి ఎక్కువ మొత్తంలో డబ్బులు రావు. ఈ పథకానికి సంబంధించి ప్రీమియం చెల్లిపులు అనేవి నెలకు లేదా మూడు నెలలకు ఒకసారి చెల్లించవచ్చు.
ఈ పథకాన్ని వినియోగించు కోవాలనుకునేవారు రూ.10,000 కనిష్టంగా మరియు గనిష్టంగా రూ.10 లక్షల వరకు పొందవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టినవారు మెచ్యూరిటీ మొత్తాన్ని వారికి 80 సంవత్సరాలు వచ్చాక పొందుతాడు. మెచ్యూరిటీ మొత్తంతో పాటు బోనస్ కూడా ఇస్తారు.
ఇది కూడా చదవండి..
Share your comments