వేసవి ముగిసింది నేడు రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకాయి .. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇప్పుడే వానాకాలం సాగుకోసం సన్నాహాలు ప్రారంభించారు. సాగు ప్రారంభించిన తరుణంలో పెట్టుబడి సాయం అందించే ప్రభుత్వ పథకం "రైతుబంధు" కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు జూన్ లేదా జులై మొదటి వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు మీడియా కథనల ద్వారా అందుతున్న సమాచారం.
అయితే ప్రభుత్వం ఇప్పటికే వానాకాలం సీజన్ లో కొత్తగా పట్టా పొందిన రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణనను ప్రారంభించింది ప్రభుత్వం, దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు విధించనప్పటికీ రైతులు ఈ నెల చివరి వరకు దరఖాస్తు చేసుకోవడం ద్వారా వానాకాలం పంట సాయం పొందే అవకాశం ఉన్నది కావున రైతు సోదరులు ఆలస్యం చేయకుండా గడువు ముగియక ముందే దరఖాస్తు చేసుకోవడం ద్వారా పెట్టుబడి సాయాన్ని పొందే అవకాశం ఉన్నది .
భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఒక కిలో రూ.700..
రైతు బంధు దరఖాస్తు కు అవసరమైన ధ్రువపత్రాలు :
అర్హులు :
1. తెలంగాణ ప్రాంత నివాసి అయి ఉండాలి.
2. రైతు భూమి సొంతంగా కలిగి ఉండాలి.
3. రైతు చిన్న ప్రాంతానికి చెందినవారు కావాలి.
4. ఇది బిజినెస్ చేసే రైతులకు వర్తించదు.
అవసరమైన ధ్రువపత్రాలు:
1. ఆధార్ కార్డు
2. ఓటరు ఐడి కార్డు.
3. పాన్ కార్డు
4. బీపీఎల్ సర్టిఫికేట్
5. భూ యాజమాన్య పత్రాలు
6. కుల ధృవీకరణ పత్రం.
7. చిరునామా ఫ్రూవ్
8. బ్యాంక్ అకౌంట్ వివరాలు.
రైతుబంధు కు విడుదలకు కొద్దీ రోజులే సమయం ఉన్నందున కొత్తగా పట్టా పాస్ బుక్ పొందిన రైతులు పైన పేర్కొన్న ధ్రువ పత్రాలను సమర్పించి దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు .
Share your comments