News

భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఒక కిలో రూ.700..

Gokavarapu siva
Gokavarapu siva

చికెన్‌ని ఇష్టంగా ఆస్వాదిస్తూ తినే ప్రజలకు ప్రస్తుత పరిస్థితి చాలా ప్రతికూలంగా ఉంది. ఒకప్పుడు రూ.150 పలికిన కిలో చికెన్ ధర కొద్దిరోజుల నుండి గణనీయంగా పెరిగి రూ.300లకు చేరింది. చికెన్ ధర తాజాగా గణనీయమైన పెరుగుదలను చవిచూసింది. పెరిగిన ఈ ధరలు ప్రజలకు చికెన్ తినాలంటే వందల సార్లు ఆలోచించేలా చేస్తుంది. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఉంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బాయిలర్‌ కోళ్ల ధర విపరీతంగా పెరిగిపోయిందని విక్రయదారులు చెబుతున్నారు. ఈ ఆకస్మిక ధర పెరుగుదలకు వేసవి వేడిమి, చికెన్ స్టాక్స్ తగ్గిపోవడం మరియు చికెన్ ఫీడ్ ఖర్చులు పెరగడం వంటి అనేక కారణాల వల్ల విక్రయదారులు చెబుతున్నారు. నెల రోజుల క్రితమే వినియోగదారులు కిలో చికెన్‌ను రూ. 200కు కొనుగోలు చేయగా, కానీ ప్రస్తుతం, వారు అదే చికెన్ ని రూ.350 పెట్టి కొంటున్నారు.

బోన్ లెస్ చికెన్ కిలో రూ.700, సాధారణ చికెన్ కిలో రూ.350కి అమ్ముడవడంతో విజయవాడ నగరంలో ప్రస్తుతం రికార్డు స్థాయిలో చికెన్ ధరలు నమోదవుతున్నాయి. ఫారమ్‌లో బతికున్న కోడి ధర కూడా కిలో రూ.166కి పెరగడంతో ఆదిలాబాద్, హైదరాబాద్ వంటి ఇతర నగరాల్లో కిలో రూ.300 దాటుతోంది.

ఇది కూడా చదవండి..

గుడ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం నుండి మరో పథకం.. పాప పుడితే రూ.6,000..

పెళ్లిళ్లు, ఫంక్షన్ల సీజన్‌లో చికెన్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉండటం, వేసవి తాపం కారణంగా ఫారాల్లో చికెన్‌ ఉత్పత్తి తగ్గడం ఈ ధర పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు. ఈ ఉత్పత్తి తగ్గుదల ధరలపై అలజడిని కలిగిస్తోందని పౌల్ట్రీ వర్గాలు సూచిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, జూన్ 12వ తేదీ మరింత పెరిగే అవకాశం ఉందని చికెన్ సెంటర్ నిర్వాహకులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..

గుడ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం నుండి మరో పథకం.. పాప పుడితే రూ.6,000..

Related Topics

chicken price increased

Share your comments

Subscribe Magazine