కేంద్ర ప్రభుత్వం రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను తీసుకువచ్చింది. రైతులను ఆర్థికంగా ముందుకు నడిపించడం కోసం మోడీ సర్కార్ రైతులకు ఎన్నో పథకాలను అందజేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరొక పథకం ద్వారా వయసుపైబడిన రైతులకు ప్రతి నెల 3000 పెన్షన్ పొందే పథకాన్ని రైతులు ముందుకు తీసుకువచ్చింది. మరి ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఏం చేయాలి? ఈ పథకానికి ఏవిధంగా అప్లై చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం...
రైతులు వయసు పైబడిన తరువాత వారి భారం ఇతరుల భయపడకుండా కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన’ పథకాన్ని తీసుకు వచ్చింది. ఇప్పటికే ఈ పథకంలో ఎంతో మంది రైతులు చేరారు.ఈ పధకంలో చేరాలంటే రైతుకు తప్పనిసరిగా ఐదు ఎకరాలు పొలం మాత్రమే ఉండాలి. అదేవిధంగా అతని వయసు 18 నుంచి 40 ఏళ్లలోపు ఉన్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ పథకంలో చేరిన రైతులు ప్రతినెల 50 రూపాయల నుంచి 200 వరకు చెల్లిస్తూ ఉండాలి. 18 సంవత్సరాలు ఉన్న వారు నెలకు 55 రూపాయలు చెల్లించాలి. అదే విధంగా 30 ఏళ్ళు ఉన్న వారు నెలకు 110 రూపాయలు చెల్లించాలి.40 సంవత్సరాలు ఉన్న వారు ఈ పథకంలో చేరితే నెలకు 200 చెల్లించాల్సి ఉంటుంది.ఈ విధంగా ఈ పథకంలో చేరిన రైతులు 60 సంవత్సరాల వరకు నెలనెలా ఈ మొత్తంలో డిపాజిట్ చేయడం వల్ల వీరికి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి నెల 3000 పెన్షన్ రూపంలో అందుతుంది.
ఒకవేళ అనుకోని ప్రమాదాలు కారణంగా లబ్ధిదారుడు మృతి చెందితే అతని జీవిత భాగస్వామికి ప్రతి నెల పెన్షన్ 1500 రూపాయలు చొప్పున అందుతుంది.ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా వయసుపైబడిన రైతులు ఎవరికి భారం కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ పథకాన్ని రైతుల కోసం తీసుకువచ్చింది. ఈ పథకంలో సభ్యత్వం పొందాలంటే రైతు తప్పనిసరిగా ఆధార్ కార్డు బ్యాంకు పాస్ బుక్ పొలం పట్టా పాస్ పుస్తకం రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు తీసుకొని మీ దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్తే ఈ పథకంలో సభ్యత్వం పొందవచ్చు.
Share your comments