Government Schemes

దేశంలో అమలవుతున్న సామాజిక భద్రత పథకాలు ఇవే !

Srikanth B
Srikanth B
social security schemes in india
social security schemes in india

 

దేశంలో అమలవుతున్న సామాజిక భద్రత పథకాలు- ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పిఎంజెజెబివై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పిఎంబిఎస్‌వై), అటల్ పెన్షన్ యోజన (ఎపివై)లకు 8 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఎనిమిదో వార్షికోత్సవం నేపథ్యంలో ప్రజలకు చౌకగా బీమా రక్షణ, జీవన భద్రత కల్పిస్తున్న ఈ పథకాల గురించి ఇక్కడ తెలుసుకుందాం !

 

ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (పిఎంజెజెబివై)

పథకం: ‘పిఎంజెజెబివై’ కింద సంవత్సరం పాటు జీవిత బీమా రక్షణ లభిస్తుంది. ఈ పథకం కింద ఏటా రుసుము చెల్లించి నవీకరించుకోవచ్చు. దురదృష్టవశాత్తూ పాలసీదారు మరణిస్తే వారి కుటుంబానికి జీవన భద్రత కల్పిస్తుంది.

అర్హత: బ్యాంకు లేదా తపాలా ఆఫీసులో వ్యక్తిగత పొదుపు ఖాతాగల 18-50 ఏళ్ల మధ్య వయస్కులు ఈ పథకం కింద నమోదు చేసుకోవచ్చు. ఇలా 50 ఏళ్లు పూర్తికాకముందే పథకంలో చేరిన వ్యక్తులు క్రమం తప్పకుండా సాధారణ రుసుము చెల్లిస్తూ 55 ఏళ్లు వచ్చేదాకా ప్రమాద బీమా రక్షణను పొడిగించుకోవచ్చు.

ప్రయోజనాలు: ఈ పథకం కింద జీవిత బీమా రక్షణ కోసం సంవత్సరానికి రూ.436 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పాలసీదారు ఏదైనా కారణంవల్ల మరణిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షలు అందుతాయి.

నమోదు: ఈ పథకం కింద నమోదు కోసం బ్యాంకు లేదా తపాలా ఆఫీసులో వ్యక్తిగత పొదుపు ఖాతాగల వారు ఆ బ్యాంకు శాఖ/బి.సి. కేంద్రం/వెబ్‌సైట్ లేదా తపాలా ఆఫీసులో సంప్రదించవచ్చు. ఖాతాదారు నుంచి సమ్మతి ఆదేశం ప్రాతిపదికన బీమా రుసుము (రూ.436) చందాదారుల ఖాతా నుంచి ఏటా నేరుగా చెల్లించబడుతుంది. ఈ పథకం, దరఖాస్తు ఫారంపై సమగ్ర సమాచారం (హిందీ, ఆంగ్లంసహా ప్రాంతీయ భాషలలోనూ) https://jansuraksha.gov.inలో లభ్యమవుతుంది.

విజయాలు: ఈ పథకం కింద 26.04.2023 నాటికి సంచిత నమోదు 16.19 కోట్లకుపైగా ఉంది. అదేవిధంగా 6,64,520 క్లెయిముల కింద రూ.13,290.40 కోట్లు చెల్లించబడింది.

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పిఎంఎస్‌బివై)

పథకం: ‘పిఎంబిఎస్‌వై’ కింద సంవత్సరం పాటు ప్రమాద బీమా రక్షణ లభిస్తుంది. ఈ పథకం కింద ఏటా రుసుము చెల్లించి నవీకరించుకోవచ్చు. పాలసీదారు ఏదైనా ప్రమాదంలో మరణించినా, అంగ వైకల్యానికి గురైనా బీమా రక్షణ లభిస్తుంది.

అర్హత: బ్యాంకు లేదా తపాలా ఆఫీసులో వ్యక్తిగత పొదుపు ఖాతాగల 18-70 ఏళ్ల మధ్య వయస్కులు ఈ పథకం కింద నమోదు చేసుకోవచ్చు.

ప్రయోజనాలు: ఈ పథకం కింద ప్రమాద బీమా రక్షణ కోసం సంవత్సరానికి రూ.20 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పాలసీదారు ఏదైనా కారణంవల్ల మరణించినా/అంగ వైకల్యం (పాక్షిక వైకల్యానికి రూ.లక్ష) సంభవించినా బీమా రక్షణ కింద రూ.2 లక్షలు లభిస్తాయి.

నమోదు: ఈ పథకం కింద నమోదు కోసం బ్యాంకు లేదా తపాలా ఆఫీసులో వ్యక్తిగత పొదుపు ఖాతాగల వారు ఆ బ్యాంకు శాఖ/బి.సి. కేంద్రం/వెబ్‌సైట్ లేదా తపాలా ఆఫీసులో సంప్రదించవచ్చు. ఖాతాదారు నుంచి సమ్మతి ఆదేశం ప్రాతిపదికన బీమా రుసుము (రూ.20) చందాదారుల ఖాతా నుంచి ఏటా నేరుగా చెల్లించబడుతుంది. ఈ పథకం, దరఖాస్తు ఫారంపై సమగ్ర సమాచారం (హిందీ, ఆంగ్లంసహా ప్రాంతీయ భాషలలోనూ) https://jansuraksha.gov.inలో లభ్యమవుతుంది.

ఇది కూడా చదవండి .

అటల్‌ పెన్షన్‌ యోజన (ఎపివై)

భారత పౌరులందరికీ.. ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాలకు, అసంఘటిత రంగ కార్మికులకు సార్వత్రిక సామాజిక భద్రత వ్యవస్థగా అటల్‌ పెన్షన్‌ యోజన (ఎపివై) ప్రారంభించబడింది. భవిష్యత్‌ అనూహ్య పరిణామాలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులలో అసంఘటితరంగ కార్మికులకు ఆర్థిక భద్రత అవసరాన్ని గుర్తిస్తూ ప్రభుత్వం దీనికి రూపకల్పన చేసింది. జాతీయ పెన్షన్‌ వ్యవస్థ (ఎన్‌పిఎస్‌) పరిధిలోని సంస్థాగత నిర్మాణంలో భాగమైన పెనన్ష్‌ నిధి నియంత్రణ-అభివృద్ధి ప్రాధికార సంస్థ (పిఎఫ్‌ఆర్‌డిఎ) ద్వారా అటల్‌ పెన్షన్‌ యోజన నిర్వహించబడుతుంది.

అర్హత: బ్యాంకు లేదా తపాలా ఆఫీసులో వ్యక్తిగత పొదుపు ఖాతాగల, ఆదాయపు పన్ను చెల్లింపు పరిధిలో లేని 18-40 ఏళ్ల మధ్య వయస్కులు ‘ఎపివై’ కింద నమోదుకు అర్హులు. తామెంచుకునే పెన్షన్‌ మొత్తం ప్రాతిపదికన వారు చందా చెల్లించాల్సి ఉంటుంది.

ప్రయోజనాలు: ఈ పథకంలో చేరినవారు చెల్లించే చందా మొత్తాన్నిబట్టి వారికి 60 ఏళ్లు దాటిన తర్వాత రూ.1,000/2,000/3,000/4,000/5,000 వంతున పూర్తి హామీగల నెలవారీ పెన్షన్‌ లభిస్తుంది.

పథకం ప్రయోజనాల వితరణ: చందాదారుకు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలవారీ పెన్షన్ లభిస్తుంది. దురదృష్టవశాత్తూ వారు మరణిస్తే జీవిత భాగస్వామికి, వారు కూడా మరణించిన పక్షంలో చందాదారుకు 60 ఏళ్లు వచ్చేదాకా పోగుపడిన పెన్షన్ నిధి మొత్తాన్ని వారు ప్రతిపాదించిన వ్యక్తి (నామినీ)కి చెల్లిస్తారు.

ఒకవేళ చందాదారు అకాల మరణం (60 ఏళ్లలోపు) పాలైతే, మిగిలిన కాలానికిగాను (చందాదారు వయసు 60 పూర్తయ్యేదాకా) వారి జీవిత భాగస్వామి చందా మొత్తం చెల్లిస్తూ ‘ఎపివై’ ఖాతాను కొనసాగించవచ్చు.

ఇప్పటికి ఈ పథకం క్రింద 5 కోట్ల మంది నమోదు చేసుకున్నారు .


ఇది కూడా చదవండి .

Share your comments

Subscribe Magazine