Government Schemes

విశాఖపట్నం లో నేడు వాహన మిత్ర డబ్బుల పంపిణి ...!

Srikanth B
Srikanth B
వాహన మిత్ర పథకం
వాహన మిత్ర పథకం

వాహన మిత్ర పథకం: ఆటో, టాక్సీ మరియు టాక్సీ డ్రైవర్లకు శుభవార్త. AP ప్రభుత్వం అందిస్తున్న వాహన మిత్ర చెక్కుల పంపిణి తేదీ ఖరారైనది , ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెక్కులను అర్హులైన లబ్దిదారులకు పంపిణి చేయనున్నారు .

ఎన్నికల ప్రతిజ్ఞలో భాగంగా ఏపీ ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాల్లో వాహన మిత్ర పథకం ఒకటి. ఈ పథకం కింద, ఆటో, క్యాబ్ మరియు ట్యాక్సీల అర్హులైన డ్రైవర్లకు వార్షికంగా రూ.10,000 సబ్సిడీ లభిస్తుంది. వాహనాల నిర్వహణ, ఇన్సూరెన్స్ వంటి ఖర్చుల కోసం ఏపీ ప్రభుత్వం ఏటా పదివేల రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్తోంది.


ఈ ఏడాది అంటే 2022-23 సంవత్సరపు వాహన మిత్ర చెక్కులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా పంపిణీ జరగనుంది. వాహనమిత్ర చెక్కుల పంపిణీ తేదీ ఖరారైంది.ఈ నెల 15వ తేదీన అంటే రేపు విశాఖపట్నం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్..వాహన మిత్ర చెక్కుల్ని పంపిణీ చేయనున్నారు. 2022-23 ఏడాదికి 2 లక్షల 61 వేల 516 మంది అర్హులైన డ్రైవర్లకు ఈ పథకం కింద లబ్ది చేకూరనుంది.

బాహుబలి సమోసా ఛాలెంజ్: 30 నిమిషాల్లో తింటే రూ.51,000 బహుమతి

ఈ ఏడాదికి వాహన మిత్ర పథకం కింద...261.51 కోట్ల ప్రయోజనం లభించనుంది. గతంలో కంటే ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. మొత్తం లబ్ధిదారుల్లో బీసీ లు 44,164, షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు 63,594 మంది ఉన్నారు. 10,000,472 మంది STలు ఉన్నారు.

తెలంగాణలోని ఈ జిల్లాలకు 'రెడ్ అలెర్ట్' హెచ్చరిక.. భారీ వర్షాలు కురిసే అవకాశం !

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More