Government Schemes

ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన :12 రూపాయల ప్రిమియంతో 2 లక్షల ఇన్సూరెన్స్ !

Srikanth B
Srikanth B

ప్రజ ప్రయోజనాలను ద్రుష్టి లో ఉంచుకొని ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొస్తుంది . అందులో ముఖ్యమైనవి ఇన్సూరెన్స్ పథకాలు . పెద ,ఆర్థికంగా వెనకబడిన తరగతుల వారికోసం 9 మే 2015 లో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన అనే పథకాన్ని తీసుకొచ్చింది . దీని ద్వారా కేవలం 12 రూపాయల వార్షిక ప్రిమియంతో ప్రమాదం లో గాయపడిన లేదా పెద్ద గాయాలు అయినప్పుడు 2 లక్షల వరకు భీమా కవరేజీ ని లబ్దిదారులకు అందిస్తుంది .

బ్యాంకు ఖాతా కల్గిన 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు వారు దీనికి అర్హులు . బ్యాంకు ఖాతా కల్గిన ప్రతి వ్యక్తి తమ KYC ను బ్యాంకు సమర్పించి , బ్యాంకు అధికారికి ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన దరఖాస్తు సమర్పించడం ద్వారా మీరు పథకానికి అర్హులు అవుతారు . ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన లో చేరిన లబ్ది దారుల ఖాతా నుంచి ప్రతి సంవత్సరం 12 రూపాయల మొత్తం ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన క్రింద తీసుకోబడుతుంది .

క్రింది సందర్భాలలో భీమా వర్తించదు :

1) 70 సంవత్సరాల వయస్సు లేదా 70 సంవత్సరాలకు కొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న సమయం భీమా వర్తించదు .

2) ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన తో ముడిపడి ఉన్న ఖాతా ను ఉపయోగించకపోవడం వల్ల మరియు మినిమం బ్యాలెన్స్ లేకపోవడం ద్వారా భీమా వర్తించడము .

3) ఒక సభ్యుడు ఒకటి కంటే ఎక్కువ ఖాతాల ద్వారా కవర్ చేయబడి ఉంటే ఆవ్యక్తికి భీమా రాదు .

4) తగినంతగా డబ్బులు ఖాతలో లేకపోవడం వంటి ఏవైనా సాంకేతిక కారణాల వల్ల బీమా రక్షణ ఆగిపోయినట్లయితే సరైన సమయానికి సంవత్సరం భీమా చెల్లించక పోతే .

PMSYMY పథకం :50 రూపాయల మొత్తంతో .. నెలకు రూ . 3000 అందించే అద్భుత పథకం !

భీమా మొత్తం ఎంత లభిస్తుంది ?

ప్రమాదానికి గురైన వ్యక్తి మరణించి నట్లయితే 2 లక్షలు
ప్రమాదానికి గురైన వ్యక్తికి తీవ్రమైన గాయాలు అనగా అంగవైకల్యం ఏర్పడితే 1 లక్ష భీమా అందుతుంది .

భీమా ఎలా పొందాలి ?
ప్రమాదం సంభవించిన వెంటనే సంబంధిత బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి .
దరఖాస్తుదారుడు సంబంధిత బ్యాంకు ఖాతా ,పాన్ కార్డు లేదా ఆధార్ కార్డులను బ్యాంకు అధికారికి సమర్పించాలి .

PMSYMY పథకం :50 రూపాయల మొత్తంతో .. నెలకు రూ . 3000 అందించే అద్భుత పథకం !

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More