ప్రజలు తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బులను సురక్షితమైన దాంట్లో పెట్టుబడులు పెట్టి రెట్టింపు చేసుకోవాలనుకుంటారు. కానీ చాలా మంది ప్రజలు ఇందులో పెట్టుబడులు పెట్టాలో తెలియక వేరేవాటిల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు. ఇలాంటివారి కోసం బ్యాంకులు అనేక రకాల స్కీమ్‌లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అయితే ఈ బ్యాంకులతో సమానంగా పోస్టాఫీస్ కూడా ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది.
పోస్టాఫిస్ శాఖ తమ వినియోగదారుల కొరకు జీవిత బీమా, పొదుపుకు సంబంధించి అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ క్రమంలోనే పోస్టాఫీస్ అందిస్తోన్న అదిరిపోయే స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు తీసుకువచ్చిన పథకం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్. ఈ పథకం అనేది మనకు తాత్కాలిక మరియు దీర్ఘకాలిక ఆర్ధిక లక్ష్యాలను అందుకోవడానికి సహాయపడుతుంది.
ఈ పథకంలో రూ.100 నుంచి పెట్టుబడులను వినియోగదారులు పెట్టుకోవచ్చు. రూ.100 అనేది ఈ పథకానికి కనిష్ట పరిమితి. ఈ పథకంలో గరిష్టంగా ఎంతైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. దీనికి గరిష్ట పరిమితి లేదు. దానితో పాటు పోస్ట్ ఆఫిస్ ఆర్‌డీ ఏడాదికి 5.8 శాతం వడ్డీని అందిస్తుంది. ఈ వడ్డీ శాతం అనేది ఇతర బ్యాంకుల కంటే అధికం. కాబట్టి ఈ పథకంలో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలను పొందవచ్చు. పైగా దీనిలో ఎలాంటి రిస్క్ ఉండదు.
ఇది కూడా చదవండి..
రైతు 50 రూపాయలు చెల్లిస్తే ...నెల నెల రూ.3 వేలు పెన్షన్ !
ఈ పథకం యొక్క మెచ్యూరిటీ సమయం అనేది ఐదు సంవత్సరాలు ఉంటుంది. ఒకవేళ ఈ పథకం తీసుకున్న వ్యక్తి కనుక మరణిస్తే నామనిలో ఉన్న వ్యక్తికి డబ్బులు అందిస్తారు. ఈ ఆర్‌డీని ముందుగానే మూసివేయాలనుకుంటే మూడేళ్ల తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు. ఈ ఖాతాను మినర్ కోరకు గార్డియన్ ఖాతాను తెరవవచ్చు.
ఈ పథకంలో వినియోగదారుడు నెలకు రూ. 10 వేలు పెట్టుబడి పెడితే ఐదేళ్ల తరువాత అతనికి రూ.6,96,968 రిటర్న్ వస్తుంది. ఇందులో మీరు రూ. 6 లక్షలు పెట్టుబడి పెడితే, వడ్డీ ద్వారా రూ. 96,968 లభిస్తుంది. అదే విధంగా ఈ స్కీమ్‌ను మరో ఐదేళ్లు పొడగితస్తే.. రూ. 16,26,476 గ్యారంటీ ఫండ్ లభిస్తుంది. ఈ పథకం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇది కూడా చదవండి..
Share your comments