Government Schemes

రైతు 50 రూపాయలు చెల్లిస్తే ...నెల నెల రూ.3 వేలు పెన్షన్ !

Srikanth B
Srikanth B

రైతులకు వృద్ధాప్యంలో బాసటగా నిలవాలని కేంద్రం నిర్ణయించింది. నెలనెలా పింఛన్‌ ఇచ్చేందుకు మార్గదర్శకాలు విడుదల చేయగా అధికార యంత్రాంగం తదనుగుణ చర్యలు చేపడుతోంది.

అన్నదాతలకు విస్తత అవగాహన కల్పించేలా క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పీఎం కిసాన్‌ మాన్‌ధన్‌ యోజనకు కేంద్రం శ్రీకారం చుట్టగా సొంత భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులకు ఆర్థిక భరోసా కలగనుంది. 60 ఏళ్లు దాటిన అన్నదాతలందరికీ స్థిరమైన ఆదాయం ఈపథకం ద్వారా లభించనుంది . నెలవారీగా రూ.55 నుంచి రూ.200 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. సొంత భూమి కలిగిన 18 నుంచి 40 ఏళ్ల వయసు, 5 ఎకరాల వరకు భూమి కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

రైతు నెలకు 50 రూపాయల మొత్తం చెల్లించి ..రూ . 3000 వరకు పెన్షన్ అందించే అద్భుత పథకం కేంద్రం అందిస్తున్న ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం కూడా కొన్ని పథకాల్ని తీసుకు వచ్చింది.


ఎంత కట్టాలి..? ఎంత వస్తుంది..?

రైతుల వయస్సును బట్టి రూ.55 నుంచి రూ.200 మధ్య ఉంటుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వయస్సు వున్నప్పుడు ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే… 18 ఏళ్ల వారు రూ.55 ప్రీమియం, 30 ఏళ్ల వారు రూ.110 ప్రీమియం, 40 ఏళ్ల వారు రూ.200 ప్రీమియం చెల్లించాలి.

ఇలా 60 ఏళ్ల దాకా కట్టాలి. 60 ఏళ్లు వయస్సు దాటగానే ప్రతీ నెలా రూ.3,000 చొప్పున పెన్షన్ ని ప్రభుత్వం ఇస్తుంది. ఒకవేళ రైతు మరణిస్తే వారి జీవిత భాగస్వామి మిగతా ప్రీమియంలు చెల్లించి పెన్షన్ పొందవచ్చు. ఒకవేళ పెన్షన్ తీసుకుంటున్న రైతు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి 50 శాతం ఫ్యామిలీ పెన్షన్ లభిస్తుంది.

రైతులకు శుభవార్త .. మార్కెట్ యార్డులో రూ.5కే భోజన సౌకర్యం !

ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం ప్రయోజనాలు :
ఈ స్కీమ్ 2019లో ప్రారంభమైంది.
రైతులకి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ పెన్షన్ స్కీమ్ ని కేంద్రం ప్రారంభించింది.
18 ఏళ్ల నుంచి గరిష్టంగా 40 ఏళ్ల వయస్సులోపు వున్నా రైతులు దీనిలో చేరచ్చు.

ప్రతీ నెలా రూ.3,000 పెన్షన్ ని మనం ఈ స్కీమ్ కింద పొందొచ్చు.
రెండు హెక్టార్ల లోపు పొలం ఉన్న రైతులు ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరొచ్చు.

రైతులకు శుభవార్త .. మార్కెట్ యార్డులో రూ.5కే భోజన సౌకర్యం !

Related Topics

adilabad farmer

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More