ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరులో వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
గుంటూరు జిల్లా చుట్టగుంటలో వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం ప్రారంభ పథకంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని రైతు సంఘాలకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్ల పంపిణీకి జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్ హార్వెస్టర్లను అందజేశారు. 5,260 రైతు గ్రూపు బ్యాంకు ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీ జమ చేశారు.
ప్రతి గ్రామంలోనూ విత్తనం నుంచి పంట అమ్మకం వరకు, వ్యవసాయంలో ప్రతి దశలోనూ రైతుకు తోడుగా ఉండేందుకు రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ నిర్మించామని. రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ క్షేత్రంలో ప్రతి అడుగులోనూ రైతుకు తోడుగా ఉంటూ.. విత్తనం సరఫరా నుంచి పంట కొనుగోలు వరకూ తోడుగా నిలబడుతున్నాయి అని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు.
రైతులు 10 శాతం కడితే చాలు:
వ్యవసాయ ట్రాక్టర్లు మరియు ఇతర యంత్రాలు తక్కువ ధరలోనే అందుబాటులో వచ్చేందుకు రైతులతోనే గ్రూపులు ఏర్పాటు చేసి ప్రభుత్వం తరపున 40 శాతం రాయితీ ఇస్తున్నాం. అంతే కాకుండా తక్కువ వడ్డీకే మరో 50 శాతం రుణాలు బ్యాంకుల ద్వారా మంజూరు చేయిస్తున్నాం. రైతులు గ్రూపులుగా ఏర్పడి కేవలం 10 శాతం డబ్బులు కడితే చాలని, వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లు మరియు ఇతర యంత్రాలన్ని కూడా రైతులకు అందుబాటు ధరలలో తీసుకురావడం జరిగిందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.ప్రధానంగా వరిని ఎక్కువగా పండించే ప్రాంతాల్లో రూ.25 లక్షలు విలువ గల కంబైన్ హార్వెస్టర్లతో కూడిన 1615 క్లస్టర్ స్ధాయి యంత్రసేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయబోతున్నాం అని వివరించారు.
మరిన్ని చదవండి.
Share your comments