Health & Lifestyle

రేషన్ కార్డు లో కొత్త నియమం ఇక నుండి ఆ సమస్య ఉండదు!

S Vinay
S Vinay

Ration card:రేషన్ కార్డుదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. ఇప్పుడు ప్రజలకు సరైన పరిమాణంలో రేషన్‌ అందించేందుకు షాపుల్లో ఎలక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ మిషన్లు ఏర్పాటు చేయనున్నారు. పూర్తి వివరాలు చదవండి.

Ration card new rule:రేషన్ కార్డుదారులకు భారత ప్రభుత్వం శుభవార్త అందించింది. వాస్తవానికి, ఇప్పుడు గ్రామస్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రేషన్ తూకం కోసం ఎలక్ట్రానిక్ యంత్రాన్ని కేంద్రం తీసుకురానుంది.దీని కారణంగా రేషన్ సరఫరాలో పారదర్శకత ఏర్పడనుంది.

రేషన్ తూకం వేసే యంత్రం
జాతీయ ఆహార భద్రతా నిబంధనల ప్రకారం రేషన్ హోల్డర్లకు సరైన పరిమాణంలో ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండేలా కేంద్రం రేషన్ షాపుల్లో ఎలక్ట్రానిక్ స్కేల్స్ రూపంలో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్‌ను తీసుకురానుంది. కేంద్రం తీసుకున్న ఈ చర్య వలన రేషన్ పంపిణీలో జరిగే మోసాలను మరియు అవకతవకలను ఆపడానికి దోహదపడుతుంది.

రేషన్ పంపిణీ నియమం ఏమిటి
కేంద్ర ప్రభుత్వం ప్రకారం, చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం ఆహార ధాన్యాల పంపిణీలో పారదర్శకత ప్రధానం.జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద దేశంలోని దాదాపు 80 కోట్ల మందికి కిలోకు రూ. 2-3 చొప్పున సబ్సిడీపై ఐదు కిలోల ఆహార ధాన్యాలను ప్రభుత్వం అందిస్తోంది.

ఆహార భద్రతకి గరీబ్ కళ్యాణ్ యోజన హామీ
మార్చి 2020లో లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత, జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద 80 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు అదనపు పరిమాణంలో ఆహార ధాన్యాలను అందించడానికి కేంద్రం PMGKAY పథకాన్ని ప్రారంభించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆహార భద్రతను నిర్ధారించడానికి ప్రతి లబ్ధిదారునికి నెలకు 5 కిలోల ఆహారధాన్యం అందిస్తున్నారు.

మరిన్ని చదవండి.

ఈ తేదీ లోపు పాన్-ఆధార్ కార్డ్‌ని లింక్ చేయపోతే... రెట్టింపు జరిమానా!

పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని తెరవండి, ప్రతి నెలా 50 వేలకు పైగా సంపాదించండి!

Related Topics

ration card telugu news

Share your comments

Subscribe Magazine