Health & Lifestyle

రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచుకోవడానికి ఆరోగ్యకరమైన మార్గాలు.....

KJ Staff
KJ Staff

రక్తంలో హిమోగ్లోబిన్ శతం తగ్గిపోవడం వలన , ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురుకోవల్సి వస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవడానికి ఐరన్ లోపించడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఐరన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా తిరిగి హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచుకోవచ్చు.

ఊపిరితిత్తుల నుండి శరీరం మొత్తం ఆక్సిజన్ సరఫరా చెయ్యడానికి హిమోగ్లోబిన్ సహాయపడుతుంది. అలాగే కార్బన్ డయాక్సైడ్ లంగ్స్ వరకు మోసుకువెళ్లేందుకు హిమోగ్లోబిన్ అవసరం. హీమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాల్లో ఒక విధమైన ప్రోటీన్ లాగా ఉంటుంది. ఎర్ర రక్తకణాలు ఎముకల్లో ఉండే బోన్ మారో నుండి ఉత్పత్తి అవుతాయి. ఎర్ర రక్తకణాలు లేదా హిమోగ్లోబిన్, ఉత్పత్తి కావడానికి ఐరన్ చాలా అవసరం. మన రోజువారీ డైట్ లో ఐరన్ లోపించినట్లైతే, శరిరంలో హీమోగ్లోబిన్ లోపిస్తుంది. ఐరన్ పుష్కలంగా లభించే కొన్ని సహజసిద్దమైన డ్రింక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బీట్రూట్ రసం:

సాధారణంగా బీట్రూట్ తినడానికి చాల మంది ఇష్టపడరు, అయితే బీట్రూట్ లో ఎన్నో పోషకవిలువలు ఉన్నాయి. హీమోగ్లోబిన్ శతం పెరగడానికి ఉపయోగపడే ఐరన్ తో పాటు, ఫోలేట్, మాంగనీస్, పొటాషియం, విటమిన్-సి పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్త ప్రసరణ సజావుగా జరగడానికి తోడ్పడతాయి. 100 గ్రముల బీట్రూట్లో సుమారు 0.8 మిల్లీగ్రాముల ఐరన్ దొరుకుతుంది.

పుదీనా ఆకుల రసం:

వినడానికి కొత్తగా ఉన్న పుదీనా ఆకుల నుండి మన శరీరానికి అవసరమునంత ఐరన్ లభిస్తుంది. ఉదయానే ఒక గ్లాస్ పుదీనా రసం తీసుకోవడం ద్వారా రోజువారి అవసరానికి సరిపోయేంత ఐరన్ లభిస్తుంది, పైగా పుదీనా రసం మన శరీరంలోని పేరుకుపోయిన మలినాల్ని బయటకు పంపిస్తుంది. 100 గ్రాముల పుదీనా ఆకుల్లో 16 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది, ఒక గ్లాస్ పుదీనా రసం నుండి సుమారు 4 గ్రాముల ఐరన్ అందుతుంది.

గుమ్మడి కాయల రసం:

గుమ్మడి రసం తాగడం ద్వారా చాల ప్రయోజనాలు ఉన్నాయి, కానీ దాని ప్రయోజనాలు తేలిక ప్రజలు దీని పెద్ద పట్టించుకోరు. ఉదయాన్నే ఒక గ్లాస్ గుమ్మడి రసాన్ని తాగడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన చేదు కొలెస్ట్రాల్ నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు గుమ్మడి జ్యూస్ నుండి 2.8 మిల్లీగ్రాముల వరకు ఐరన్ మన శరీరానికి లభిస్తుంది.

Share your comments

Subscribe Magazine