Health & Lifestyle

వేసవి కాలంలో ఈ పళ్ళను ఖచ్చితంగా మీ డైట్లో చేర్చుకోండి......

KJ Staff
KJ Staff

వేసవి కాలంలో ప్రతీ ఒక్కరిని ప్రధానంగా వేదించే సమస్య అలసట మరియు చికాకు. ఎండ వేడి ఎక్కువుగా ఉండటం మూలాన శరీరం నీటిని కోల్పోయి, చాల నీరసంగా అనిపిస్తుంది. పెద్ద వారిలో ఈ లక్షణం అధికంగా కనిపిస్తుంది. అయితే మీ అలసటను చిటికెలో దూరం చేసి వెంటనే శక్తిని అందించగలిగినవి పళ్ళు మాత్రమే. కూల్ డ్రింకులు, మరియు ఇతర పానీయాలు తాగినంత మాత్రాన అలసట దూరం కాదు పైగా ఈ పానీయాలు రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా పెంచుతాయి.

వేసవి కాలంలో ఎక్కువ పళ్ళను తినడం మూలాన, ఎండ వేడిని తట్టుకోగలిగే శక్తీ శరీరానికి లభించి, రోజంతా ఫ్రెష్ గా మరియు హైడ్రాటెడ్ గా ఉంటారు. పళ్ళను జ్యూస్ లాగా కాకుండా, నేరుగా తినడం వల్ల శరీరానికి, కావాల్సిన నీతితో పాటు ఫైబర్ కూడా లభిస్తుంది, ఇది షుగర్ లెవెల్స్ పెరగకుండా నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండటానికి, రక్త పోటు దూరంగా ఉండటానికి పళ్ళు ఉపయోగపడతాయి. వేసవి కాలంలో మనకు అందుబాటులో ఉన్న పళ్ళను తినడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడి పళ్ళు:

మామిడి పండు తిననిదే వేసవి కాలం పూర్తికాదు. వేసవి కాలాన్ని మామిడి కాలంగా కూడా చెప్పుకోవచ్చు. అంతే కాకుండా ఈ వేసవి కాలం పచ్చళ్లకు కూడా ప్రసిద్ధి, సంవత్సరం మొత్తానికి వేసవికాలంలోనే పచ్చళ్ళను సిద్ధం చేసుకుంటాము. మామిడిని పళ్లలో రారాజుగా పిలుస్తారు, దీనిలో అధికం మొత్తంలో ఫైబర్, యాంటీఆక్సిడాంట్స్, విటమిన్స్ లభిస్తాయి. ఇవి మన శరీరాన్ని రోగాల బారినుండి రక్షిస్తాయి. మామిడిలో క్యాలరీలు తక్కువుగా ఉండటం మూలాన షుగర్ ఉన్నవారు కూడా నిశ్చింతగ తినవచ్చు.

బత్తాయి:

వేసవి కాలంలో వివిరిగా లభించే బత్తాయిని తినడం వల్ల, ఎండలో వడ దెబ్బ తగలకుండా, శరీరానికి అవసరమైన నీళ్లు మరోయు పోషకాలను అందిస్తుంది. బత్తాయిలో విటమిన్-సి పుష్కలంగా లభిస్తుంది, విటమిన్-సి, రోగనిరోధక శక్తిని పెంచి అనారోగ్యం భారిన పడకుండా కాపాడతాయి. అంతే కాకుండా విటమిన్- సి శరీరానికి సహజసిధమైన కాంతిని ఇస్తుంది. రోజంతా ఉత్సహంగా ఉండేదుకు, నీళ్లు, ఎలెక్ట్రోలైట్లు బత్తాయిని తినడం ద్వారా లభిస్తాయి.

మస్క్ మెలోన్:

దీనినే మనం ఖర్భుజా అని కూడా పిలుస్తాం.సాధారణంగా మస్క్ మెలోన్ ని ముక్కలుగా కంటే జ్యూస్ లాగా తాగేందుకు ఎక్కువ ఇష్టపడతారు. అయితే ఖర్బుజాని, ముక్కలుగా తినడం ద్వారా దీనిలో ఉండే ఫైబర్, శరీరానికి అందుతుంది. ఖర్భుజాలో కూడా విటమిన్ - ఏ, సి, విటమిన్-బి కాంప్లెక్స్, ఎలెక్ట్రోలైట్స్ అధిక మొత్తంలో లభిస్తాయి.

పుచ్చకాయ:

పుచ్చకాయని వాటర్ మెలోన్ అని కూడా పిలుస్తాం, పేరుకు తాగట్టు గానే పుచ్చకాయలో అధిక మొత్తంలో నీరు ఉంటుంది, ఈ నీరు మన శరీరాన్ని హైడ్రేట్ చెయ్యడంలో ఉపయోగపడుతుంది. రాత్రి పుట భోజనం తినాలనిపించని సమయాల్లో ఒక చిన్న సైజు పుచ్చ కాయని తింటే కడుపునిండుగా ఉంటుంది. మధ్యాహ్నం మంచి ఎండగా ఉన్న సమయంలో ఒక పుచ్చకాయని తింటే ఆ హాయి మాటల్లో వర్ణించలేనిది.

Share your comments

Subscribe Magazine