Health & Lifestyle

పొద్దుకడుపున బొప్పాయి తింటున్నారా? అయితే ఇది మీకోసమే....

KJ Staff
KJ Staff


ఆరోగ్యంపై అధిక శ్రద్ధ చూపించేవారు, డైటింగ్ చేసే సన్నబడాలి అనుకునే వారు బొప్పాయిని తమ రోజువారి డైట్ లో ఒక భాగం చేసుకుంటారు. మరికొంత మంది లేవగానే బొప్పాయిని తినడానికి మక్కువ చూపుతారు. బొప్పాయిని పొద్దుకడుపున తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయి పండు, పోషకాలు నిధి వంటిది. శరీర పనితీరును పెంచే ఎన్నో ప్రయోజకాలు, పోషక విలువలు బొప్పాయిని తినడం ద్వారా లభిస్తాయి. మునపటి రోజుల్లో బొప్పాయి పెరటి మొక్కగా ఉండేది కానీ ఈ మధ్య కాలంలో దీనికి డిమాండ్ పెరగడంతో, రైతులు ఉద్యాన పంటగా కూడా సాగుచేస్తున్నారు. బొప్పాయిలో దొరికే 'పపైన్' అనే ఎంజైమ్, మనం తీసుకున్న ప్రోటీన్లు జీర్ణం కావడానికి తోడ్పడి, ఆహరం సమర్ధవంతంగా జీర్ణం అవుతుంది. పరగడుపున బొప్పాయిని తినడం ద్వారా రోజంతా ఫ్రెష్ గా, ఉంటుంది.

బొప్పాయిలో అధిక శాతం, శరీరానికి అవసరమైన, కారెటినోయిడ్స్, ఆల్కలాయిడ్స్, ఫ్లవనోయిడ్స్, విటమిన్స్ మరియు మినరల్స్ ఉంటాయి ఇవి శరీరలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో, మరియు గుండె ఆరోగ్యం మెరుగుపరచి, శరీరమంతా రక్త ప్రసరణ సజావుగా జరగడానికి సహాయం చేస్తాయి. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో వడ దెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది కనుక బొప్పాయిని తినడం ద్వారా శరీరం హైడ్రేట్ అయ్యి సన్ స్ట్రోక్ భారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

ఉదయం పుట కాలీకడుపుతో బొప్పాయిని తినడం ద్వారా, బొప్పాయిలో ఉండే పపైన్ ఎంజైమ్ శరీరంలోని మలినాలను శుభ్రం చేసి బయటకు పంపిస్తుంది. అంతే కాకుండా తీసుకున్న ఆహరం, సులువుగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. ఇతర ఫలాలతో పోల్చుకుంటే బొప్పాయిలో క్యాలరీల శాతం తక్కువ గనుక, బరువు తగ్గాలి అనుకునేవారు, బొప్పాయిని నిశ్చింతగా తినవచ్చు.

శరీరంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో బొప్పాయి సాయపడుతుంది కొన్ని అధ్యయనాల్లో తేలింది, ఇన్సులిన్ ఉత్పత్తి సరైన నిష్పత్తిలో జరిగి షుగర్ లెవెల్స్ నియంత్రించబడతాయి. శరీరానికి ఎంతో అవసరమైన, విటమిన్- ఏ, సి, ఈ బొప్పాయిలో పుష్కలంగా దొరుకుతాయి, ఇవి క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ ని శరీరం నుండి తొలగించి కాన్సర్ వ్యాధి నుండి కాపాడుతాయి.

Share your comments

Subscribe Magazine