Health & Lifestyle

మెదడు పనితీరును పెంచుకోండి ఇలా.....

KJ Staff
KJ Staff

దైనందన జీవితంలో, అధిక స్ట్రెస్ తో కూడుకున్న జాబ్స్, కుటుంబ సమస్యలు, మరియు ఇతర టెన్సన్స్ మూలంగా, మెదడు పనితీరు తగ్గడం, లేదా మొద్దుబారడం గమనించవచ్చు. మెదడు పనితీరు తగ్గడం మూలాన ఏకాగ్రత లేకపోవడం, మరియు ఆసక్తి తగ్గడం ఇబ్బందులు తలెత్తుతాయి. దీనిని ఇలాగె వదిలేస్తే ఆంక్సిటీ వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఎన్నో అనారోగ్యసమస్యలకు కూడా దారితీస్తుంది. అయితే మెదడు పనితీరును పెంచుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

ప్రతి రోజు యోగ:

ప్రతి రోజు యోగ చెయ్యడం ద్వారా మానశిక ప్రశాంతత, ఆలోచనలపై నియంత్రణ, మరియు పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. అధిక ఒత్తిడి కలిగిన జాబ్స్ చేస్తున్న వారికీ యోగ ఒక వరం లాంటిది అని చెప్పవచ్చు. యోగాను ఒక అలవాటుగా మార్చుకుని ప్రతీ రోజు ఆచరించడం ద్వారా ఎన్నో మార్పులను గమనించవచ్చు.

సరైన నిద్ర:

నిద్రపోవడం ఒక యోగం. రోజుకు ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడం మైండ్ రిలాక్స్ అవుతుంది. మొబైల్ ఫోన్ హ్యాంగ్ అయినప్పుడు రీస్టార్ట్ చేస్తే తిరిగి నార్మల్గా పనిచేసినట్టు, నిద్ర సమయం మన శరీరానికి రీస్టార్ట్ బటన్ వంటిది. మన శరీరం తననితాను రిపేర్ చేసుకోవడానికి నిద్ర చాల అవసరం.

మెరుగైన ఆహరం:

మన మెదడు పనితీరుపై ఆహరం ఎంతో ప్రభావం చూపుతుంది. నేటి రోజుల్లో అధికమవుతున్న జంక్ ఫుడ్స్ శరీరంతో పాటు మెదడు పని తీరుమీద కూడా దుష్ప్రభావాలను చూపుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం మెదడు పనితీరును పెంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ప్రతి రోజు ప్రోటీన్లను తినడం ద్వారా మెదడు పనితీరు పెడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

ప్రకృతితో మమేకమవ్వడం:

స్మార్ట్ఫోన్ వచ్చాక ప్రజలు దానికి బానిసల్లాగా తయారయ్యారు. మనం వాడుతున్న అన్ని సోషల్ మీడియా అప్స్ మనకి ఆనందాన్ని ఇస్తున్నట్లు కనిపించిన, అవి మన ఏకాగ్రత తగ్గిపోయేలా చేస్తున్నాయి. నేడు యువతః ప్రధానంగా ఆంక్సియేటి తో బాధ పడటానికి ముఖ్య కారణం సోషల్ మీడియానే. స్మార్ట్ఫోన్ వినియోగాన్ని తగ్గించడానికి, ప్రకృతితో మమేకమవ్వడం ఒక సులువైన మార్గం. ప్రకృతి మానసిక ఆనందాన్ని మనకు ఇస్తుంది.

Share your comments

Subscribe Magazine